couple kills three daughters, ends life లాటరీ వ్యసనం: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు..

Couple poisons three daughters sends video to friends before committing suicide

Tamil Nadu Shocker: Villupuram suicide case, Tamil Nadu suicide case, Financial Debts, Family suicide Lottery Addiction, Couple Poisons Three Daughters, Couple suicide Video to Friends, crime, Suicide, Tamil Nadu

Upset over their huge debts, a couple in Tamil Nadu poisoned their three children before committing suicide at Villupuram. Police have identified the victims as M Arun (33), a goldsmith, his wife Sivagami (33) and their three daughters – Priyadarshini (4), Yuvasri (3) and three-month-old Bharathy.

లాటరీ వ్యసనం: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు..

Posted: 12/13/2019 03:43 PM IST
Couple poisons three daughters sends video to friends before committing suicide

లాటరీ విషయంలో మోసపోయిన ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. లాటరిలో నమ్మకం పెట్టి ఓవర్ నైట్ లో లక్షాధికారులు అయిన కొందరిని ఉదాహరణగా తీసుకుని.. లాటరీ కొనుగోలును వ్యసనంగా మార్చుకున్న ఓ కుటుంబం పీకలోతు అప్పుల్లోకి కూరుకుపోయి.. తమ చావుకు ఆర్థిక ఇబ్బందులే కారణమని ఓ వీడియో తీసిమరీ తనువు చాలించింది. తమిళనాడులోని విల్లుపురంలో ఈ దారుణం చోటుచేసుకుంది.

ఘటన వివరాల్లోకి వెళ్తే.. సితేరికరై ప్రాంతంలో నివసిస్తున్న అరుణ్‌(33) వ్యాపారం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తాజాగా వ్యాపారంలో నష్టం రావడంతో అధిక సొమ్ము వెచ్చించి.. అక్రమంగా నిర్వహిస్తున్న లాటరీకి సంబంధించిన టికెట్లు కొనుగోలు చేశాడు. కాగా లాటరీ విషయంలో కూడా మోసపోవడంతో చివరికి కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముందుగా తమ ముగ్గురు పిల్లలకు సైనేడ్‌ ఇచ్చి... అనంతరం భార్య, భర్తలిద్దరూ కూడా చనిపోయారు.  చనిపోయే ముందు అరుణ్‌ తీసిన వీడియో అందరిని కంటతడి పెట్టిస్తోంది.

వీడియోలో..  ‘‘లాటరీ టిక్కెట్లు కొనడం వల్ల అప్పులపాలయ్యాను. సమాజంలో న్యాయం, చట్టం ఏవీ లేవు. నా ముగ్గురు పిల్లలకు విష గుళికలు ఇచ్చాను. నా కూతుళ్లు నా కళ్ల ఎదుటే చనిపోయారు. కాసేపట్లో మేము కూడా విషం తీసుకోనున్నాం. మేము బతికి ఉండాలని కోరుకోవడం లేదు. మాకోసం ఎవరూ ఏం చేయకండి. మేము ఎవరికి భారం కావాలని అనుకోవడం లేదు. మీరైనా సంతోషంగా జీవించండి. మాలాగా అవ్వకండి. అలాగే  అక్రమంగా జరిగే లాటరీ అమ్మకాలను నిషేధించాలని తమిళనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.’’ అని కన్నీటి పర్యంతమయ్యారు.

ఈ వీడియోను చూసిన అరుణ్ స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఘటన స్థలానికి చేరుకునేలోపు కుటుంబంలోని అయిదుగురు మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం విల్లుపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికులను పోలీసులు విచారించగా అరుణ్‌కు దాదాపు రూ. 30 లక్షల వరకు అప్పులు ఉన్నాయని తేలింది. ఇక వీరి మరణంతో రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ లాటరీ అమ్మకాల విషయం వెలుగులోకి వచ్చింది. కాగా ఈ ఏడాది రాష్ట్రంలో 200 కంటే ఎక్కువ  అక్రమ లాటరీ కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : couple suicide  suicide video  financial debts  lottery addiction  villupuram  Tamil Nadu  crime  

Other Articles