AP Govt announces mega dsc for 7900 post నిరుద్యోగ యువతకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..

Andhra pradesh government announces mega dsc for 7900 post

Mega DSC, DSC, Amaravati, Adimulapu Suresh, Education Minister, UnEmployed, Assembly, Winter Session, Alla RamaKrishna Reddy, All posts, Andhra Pradesh, Politics

Andhra Pradesh government has another good news for Unemployed. Next month, the government of Andhra Pradesh is planning to conduct mega DSC in January 2020. Andhra Pradesh Education Minister Adimulapu Suresh today announced the mega DSC in the Assembly.

నిరుద్యోగ యువతకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..

Posted: 12/09/2019 12:35 PM IST
Andhra pradesh government announces mega dsc for 7900 post

ఆంధ్రప్రదేశ్ ఫ్రభుత్వం నిరుద్యోగ యువతకు మరో గుడ్ న్యూస్ అందించింది. ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనే ఔత్సాహికులకు వారి అదృష్టాన్ని పరీక్షించుకునే తరుణం వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అంటూ గత కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న డీఎస్సీని వచ్చే నెలలో నోటిఫికేషన్ ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అసెంబ్లీలో ఈ విషయాన్ని వెల్లడించారు.

వచ్చే నెలలో 7,900 టీచర్‌ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తామని, అందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలలో భాగంగా ఈ ప్రకటన వెలువడింది. కాగా డీఎస్సీతో పాటుగా తన పాదయాత్రల నేపథ్యంలో వైసీసీ అధినేత జగన్ ప్రజలకిచ్చిన మరో హామీ ప్రకారం అన్నింటినీ నెరవేరుస్తామన్నారు. ప్రతీ ఏటా జనవరిలో ప్రభుత్వంలోని అన్ని శాఖల ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి అసెంబ్లీలో చెప్పారు.

శీతాకాల సమావేశాల్లో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నలకు మంత్రి సురేష్‌ సమాధానమిచ్చారు. ఈ క్రమంలో సురేష్‌ మాట్లాడుతూ... ప్రతీ ఏడాది జనవరిలో అన్ని శాఖల ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. అదే విధంగా పేదలందరికీ ఇంగ్లీషు మీడియంలో విద్య అందించేలా తమ ప్రభుత్వం విద్యాసంస్కరణలు చేపట్టిందని సభకు తెలిపారు.

‘పేద విద్యార్థులకు ఇంగ్లీషు విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం. టీడీపీ హయాంలో భాషా పండితులను విస్మరించారు. అయితే మా ప్రభుత్వం విద్యాశాఖలో భాషా పండితులకు పదోన్నతులు కల్పించింది. మొత్తం 12 వేల మంది భాషా పండితులకు పదోన్నతి లభించింది. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ సమస్యను సీఎం జగన్ పరిష్కరించారు. సీఎం నిర్ణయంతో భాషా పండితులంతా సంతోషంగా ఉన్నారు అని సురేష్‌ వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల మాద్యమంలో బోధన ప్రారంభించనున్నామని సురేష్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mega DSC  DSC  Amaravati  Adimulapu Suresh  Education Minister  UnEmployed  Andhra Pradesh  

Other Articles