Anam Ramnarayana requests speaker to change his place సభలో ఆనం వ్యాఖ్యలపై అధికార వైసీపీ సభ్యులు నవ్వులు

Anam ramnarayana requests speaker to change his place

mla Anam asks speaker to change seat, mla Anam on Chandrababu, mla Anam on seat changing, AP Assembly Sessions, Anam Ramnarayana, YSRCP, TDP, Amaravati, Andhra Pradesh, Politics

The verbal assault between the between the ruling and opposition parties on the issue of PPAs in the Andhra pradesh Assembly on the first day. In the backdrop Anam Ramnarayana Reddy who sit beside Chandrababu requested speaker to change his place in the house citing the disturbance from the opposition party leaders.

‘‘సీటు మార్చండీ అధ్యక్షా’’ నవ్వులు పూయించిన ఆనం రిక్వెస్ట్..

Posted: 12/09/2019 01:18 PM IST
Anam ramnarayana requests speaker to change his place

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శీతకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజునే అధికార, విపక్షాల మధ్య వేడిని రాజేస్తున్నాయి. సభ ప్రశ్నోత్తరాల సమయంలో అధికార-ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడిచింది. విద్యుత్ రంగంలో గోపాల్ రెడ్డి కమిటీ ఇచ్చిన నివేదికపై ఏం చర్యలు తీసుకున్నారంటూ ప్రభుత్వాన్ని టీడీపీ ప్రశ్నించింది. ఈ అంశమై అధికార విపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరగుతున్న క్రమంలో ఇదే అంశమై ఆనం రామనారయణ రెడ్డి మాట్లాడుతున్న సందర్భంలో ఆయన వ్యాఖ్యలతో సభలో అధికార పక్ష సభ్యులు నవ్వుకున్నారు. అంతేకాదు స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలతో నవ్వుకున్నారు.

గత ప్రభుత్వ హయాంలో పీపీఏలలో అవకతవకలు జరిగాయన్న అంశంలో చర్చ జరుగుతోంది. అయితే టీడీపీ హయాలో ఎలాంటి అవకతవకలు జరగలేదని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. పీపీఏలపై కమిటీలు వేసి గందరగోళం పరుస్తున్నారని.. ఈ ప్రభుత్వ విధానాల వల్ల పెట్టుబడులు పెట్టాలంటే ఆలోచిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆరు నెలలు ఏం చేశారని ప్రశ్నించారు. దీనిపై మంత్రి బుగ్గన సమాధానమిస్తూ.. కెబినెట్ సబ్ కమిటీ అన్నింటినీ పరిశీలిస్తోందని.. వాటిని తగు సమయంలో నివేదిక కూడా సమర్పిస్తోందని అన్నారు. గతంలో 15 రోజుల్లో 41 పీపీఏలు చేసుకున్నారని.. దీంతో డిస్కింలు కుప్పకూలే పరిస్థితికి చేరకున్నాయని అన్నారు. రూ.9వేల కోట్ల నుంచి రూ.29వేల కోట్లకు అప్పు తీసుకొచ్చారు అన్నారు.

ఆతర్వాత.. ఈ అంశంపై తమ నేత చంద్రబాబు మాట్లాడే అవకాశం ఇవ్వాలని టీడీపీ పట్టు పట్టింది. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి కలగజేసుకొని ప్రశ్నోత్తరాల సమయంలో ఇలా సభను అడ్డుకొని, నిరసన అనడం సరికాదన్నారు.. సభా సంప్రదాయాలను పాటించాలన్నారు. ఇక అరాచక శక్తులన్న పదం వాడిన చంద్రబాబు వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. చంద్రబాబు క్షమాపణ చెప్పాలని, లేకపోతే అరాచకశక్తులు అనే పదాన్ని రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ను కోరారు.

తన సీటు మార్చాలని ఆనం స్పీకర్‌ను కోరారు.  ప్రతిపక్ష నాయకుడే తన పక్కకు వచ్చి నిలబడితే, తాను ఏం మాట్లాడగలనని అన్నారు. చంద్రబాబును తట్టుకునేంత శక్తి తనకు లేదని చెప్పారు. చంద్రబాబు పక్క వరుస నుంచి తన సీటును మరో చోటుకు మార్చాలని కోరారు. దీంతో ఆనం వ్యాఖ్యలపై సభలో నవ్వులు పూసాయి. ఆనం వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి వెఎస్ జగన్ కూడా నవ్వుకున్నారు. ఆ తరువాత సభలో మళ్లీ హాట్ డిస్కషన్స్ కు తెర లేచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP Assembly Sessions  Anam Ramnarayana  YSRCP  TDP  Amaravati  Andhra Pradesh  Politics  

Other Articles