Three Heroines involved in karnataka honey trap case.? కర్ణాటక హనీట్రాప్ కేసు: ముగ్గురు హీరోయిన్లపైనే అనుమానం..

Three heroines involved in karnataka honey trap case

honeytrap, Karnataka bypolls, Karnataka MLAs, Karnataka honey trap, Madhya pradesh honeytrap, bengaluru, senior heroine, two heroines, TV actress, video viral

The honeytrap case involving influential people seems to be snowballing just ahead of the December 5 bypolls. Some leaders of major political parties, including a few who are contesting the bypolls, now find themselves embroiled in the controversy.

ముగ్గురు హీరోయిన్ల ట్రాప్ లో పలువురు ఎమ్మెల్యేలు..?

Posted: 12/05/2019 11:35 AM IST
Three heroines involved in karnataka honey trap case

మధ్యప్రదేశ్ తరువాత అంతటి సంచలనం రేపుతున్న హానీట్రాప్ కేసు కర్ణాటక వెలుగుచూసింది. తీవ్ర కలకలం రేపుతున్న ఈ హనీ ట్రాప్ కేసులో ఓ టాప్ సీనియర్ హీరోయిన్ తో పాటు, మరో ఇద్దరు నటీమణులు ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగిన నటితో పాటు, ఈమధ్య కాలంలో రెండు మూడు సినిమాల్లో నటించిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎంపీలను హనీట్రాప్ చేశారని, వారితో శృంగారం జరుపుతూ వీడియోలు చిత్రీకరించారని భావిస్తున్న పోలీసులు, ప్రాథమిక సాక్ష్యాధారాలను సేకరించే పనిలో ఉన్నారు.

రాజకీయ నాయకుల శృంగార వీడియోల బయటకు వచ్చిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ హీరోయిన్ 25కు పైగా చిత్రాల్లో నటించిందని సమాచారం. మిగతా ఇద్దరిలో ఓ నటి చిన్న సినిమాలు, టీవీ సీరియళ్లు, రియాల్టీ షోలలో కనిపించగా, మూడో నటి కన్నడతో పాటు ఇతర సినిమాల్లోనూ కనిపించిందట. గత వారం ఈ హనీట్రాప్ వ్యవహారం బయటకు వచ్చింది. చాలా మంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల వీడియోలు బయటకు వచ్చాయి. ఈ కేసులో రాఘవేంద్ర అనే వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.

రాఘవేంద్ర, తన ప్రియురాలిని, కొందరు అమ్మాయిలను ఎమ్మెల్యేల వద్దకు పంపి వారితో పరిచయాలు పెంచుకున్నాడని పోలీసులు గుర్తించారు. వారిని రహస్యంగా వీడియోలు తీసి, వారి నుంచి భారీగా డబ్బులు డిమాండ్ చేశాడు. కాగా, ఉపఎన్నికల బరిలో నిలబడిన ఓ బీజేపి అభ్యర్థి వీడియోలు వైరల్ కావడంతో.. ఆయన పిర్యాదు మేరకు కదిలిన పోలీసులు.. ఈ ట్రాప్ వెనుకునున్న డొంకను కదిల్చేడంతో.. ఈ కేసులో ప్రధాని నిందితుడు రాఘవేంద్ర అలియాస్ రఘు.. అతని ప్రియురాలు పుష్ప మరియు పుష్పవతిలను అరెస్టు చేశారు. వీరిని విచారించగా.. తెరవెనుక సినీ హీరోయిన్ల ప్రమేయంపై ఉప్పందినట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : honeytrap  Karnataka bypolls  Karnataka MLAs  Karnataka honeytrap  Madhya pradesh  video viral  

Other Articles