businessman held for attacking bank staff with air pistol లోన్ రిజెక్ట్.. బ్యాంకు సిబ్బందిపై వ్యాపారవేత్త దాడి..

Coimbatore businessman attacks canara bank staff with air pistol

coimbatore, coimbatore canara bank, coimbatore man loan, coimbatore man attack bank loan reject, canara bank, businessman, loan, Rejected, 3 Lakhs bribe, air pistol, attack bank staff, Ramanathapuram, coimbatore, Tamil Nadu

Armed with an air pistol, 44-year-old Vetrivel, a local businessman, barged into Bank chief Manager chamber of Canara Bank at Ramanathapuram of coimbatore and began attacking the staff, threatening to shoot him. CCTV visuals from the room show the chief manager intervening, only to be attacked next.

లోన్ రిజెక్ట్.. బ్యాంకు సిబ్బందిపై వ్యాపారవేత్త దాడి..

Posted: 12/05/2019 12:25 PM IST
Coimbatore businessman attacks canara bank staff with air pistol

రుణాలు కావాలా.. క్షణంలో మంజూరు చేస్తాం.. అంటూ బ్యాంకు కాల్ సెంటర్ల నుంచి వచ్చే ఫోన్లను నమ్మితే.. చెప్పులరిగేలా తిరిగినా..రుణాలు మంజూరు కావన్న విషయం చాలా మందికి అనుభవమే. దీంతో వీరు ప్రైవటు బ్యాంకులు, ప్రైవేటు ఏజెన్సీలను ఆశ్రయించి రుణాలను తీసుకుంటుంటారు. తన ఆస్తులను తనఖా పెట్టుకుని రుణం (లోన్‌) మంజూరు చేయాలని తిరిగిన ఓ వ్యాపారవేత్తకు కూడా ఇలాంటి చేధు అనుభవమే ఎదురైంది.

దీంతో ఆయన కోపోద్రిక్తుడై.. ఏకంగా బ్యాంకుకు వెళ్లి.. అక్కడి మేనేజర్ల్ సహా సిబ్బందిపై దాడి చేశాడు. అంతేకాదు ఏకంగా తుపాకీని గురిపెట్టి మరీ బెదిరించాడు. ఇంతలా తాను ఆగ్రహం చెందడానికి కారణం కూడా వుంది. తన సమస్యల నుంచి బయట పడేందుకు రుణం చాలా అవసరమని.. అందుకోసం బ్యాంకు సిబ్బందికి ఏకంగా మూడు లక్షల రూపాయల లంచం కూడా ఇచ్చాడు. అయినా వారు రుణం మంజూరు చేయకపోవడంతో ఆయన ఆవేశం కట్టలు తెంచుకుంది. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్ లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే కోయంబత్తూర్‌ లోని రామనాథపురం ప్రాంతంలో వున్న కెనరా బ్యాంక్‌ శాఖలో స్థానిక వ్యాపారవేత్త వెట్రివేల్ తన ఆస్తిని తాకట్టు పెట్టి కోటి రూపాయలు రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఎలాంటి అడ్డంకులూ లేకుండా రుణం మంజూరు చేయించేందుకని వెట్రివేల్ ఓ మధ్యవర్తికి రూ.3 లక్షలు నగదు కూడా చెల్లించాడు. కానీ బ్యాంక్‌ అధికారులు ఆయన లోన్ దరఖాస్తును తిరస్కరించడం వెట్రివేల్ కు ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆయన కత్తి, తుపాకితో బ్యాంక్‌ మేనేజరుతో పాటు సిబ్బందిపై దాడికి దిగాడు.

బ్యాంకు మేనేజరును రక్షించేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరిపై కూడా దాడి చేసినట్లు అక్కడున్నవారు తెలిపారు. తాను అప్పుల్లో ఉన్నానని, రుణం మంజూరు కాకపోతే ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నట్లు వెట్రివేల్ తెలిపాడు. ప్రస్తుతం అతన్ని పోలీసుల అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనపై బ్యాంకు అధికారులు స్పందిస్తూ .. వెట్రివేల్‌ దరఖాస్తు చేసుకున్న మొత్తం ఎక్కువగా ఉండటం వల్ల రుణం మంజూరు కాలేదని తెలిపారు. అతను మరి కొన్ని ఆస్తులు తాకట్టు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ రుణం మంజూరు బాధ్యత తమది కాదని, అది బ్యాంక్‌ ప్రధాన కార్యాలయం నిర్ణయమని  బ్యాంక్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles