TSRTC workers can resume duties: KCR గుడ్ న్యూస్: ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరవచ్చు.. నో కండీషన్స్: సీఎం

Tsrtc employees can join duty from friday cm kcr

TSRTC Workers, High Court, Routes Privatise, Jana Samiti, PIL,RTC MD Sunil sharma, kareem khan, karimnagar, TRS, rtc mechanic, heart stroke, tsrtc jac, Telangana movement, Ashwathama Reddy, TSRTC, TSRTC Workers, TSRTC Workers Strong Warning, Telangana Bandh, ts government

The Telangana CM said that the state government has decided to give Rs 100 crore to the RTC to temporarily mitigate the losses. After a deadlock that lasted for close to two months, KCR said that the state government is willing to welcome back striking workers of the TSRTC.

గుడ్ న్యూస్: ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరవచ్చు.. నో కండీషన్స్: సీఎం

Posted: 11/28/2019 07:51 PM IST
Tsrtc employees can join duty from friday cm kcr

గత 55 రోజులగా సమ్మెబాట పట్టిన ఆర్టీసీ కార్మికులు గత వారం రోజులుగా ప్రభుత్వం తమను ఎప్పుడు కనుకరిస్తుందా.? తమను ఎప్పుడు విధులకు హాజరకమ్మని చెబుతుందా..? అంటూ వేచి చూస్తున్న వారికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీపికబురు అందించారు. తమ జీవితాలను ప్రభుత్వం ఆగం చేస్తుందని, పిల్లల ఫీజులు, ఇంట్లో సరుకులు, ఇంటి అద్దెలు కట్టలేక తాము అనేక అగచాట్లు పడుతున్నామని, తమ జీవితాలను అంధకారం చేయవద్దని గత వారం రోజులుగా తమ డిమాండ్లను పక్కన బెట్టి కోరుతున్న కార్మికుల దీనిస్థితిని అర్థం చేసుకున్న మనస్సున్న మారాజు ఒక్క మాటతో వారు కష్టాలను గట్టెక్కించారు.

ఆర్టీసీ కార్మికులకు మరో అవకాశం ఇస్తున్నామని.. రేపు శుక్రవారం ఉదయం అందరూ విధుల్లో చేరాలని స్పష్టం చేశారు. విధుల్లో చేరేందుకు ఎలాంటి షరతుల్లేవని చెప్పారు. తమది పేదల పొట్ట నింపే ప్రభుత్వమని చెప్పిన కేసీఆర్.. అదే మానవత్వా దృక్పథంతో ఆర్టీసీ కార్మికుల సమస్యలను కూడా వింటామని, అయితే యూనియన్ నాయకులతో కాకుండా ప్రతీ డిపో నుంచి ఐదుగురు సభ్యులను వారం పది రోజుల్లో ప్రగతిభవన్ కు పిలిపించుకుని సమ్యలను సవివరంగా వింటామన్నారు. కాగా, ఆర్టీసీ సంస్థ ప్రగతిపైనే కార్మికుల ప్రగతి ఆధారపడి వుందని చెప్పిన ముఖ్యమంత్రి సంస్థ పరిస్థితిని కూడా కార్మికులు అధ్యయనం చేసుకోవాలని చెప్పారు.

రాష్ట్రం నుంచి ప్రాతినిథ్య వహిస్తున్న కేంద్ర మంత్రి ముగ్గురు బీజేపి ఎంపీలు  లోక్‌సభలో నూతన రవాణా చట్టానికి అనుకూలంగా ఓటు వేశారని అన్నారు. ఇది ప్రజలకు తెలియాల్సిన అవసరం వుందని చెప్పారు. ఆర్టీసీ విషయంలో కేంద్రం ఏం జోక్యం చేసుకుంటుంది. వారి వాటా నష్టాలు చెల్లించమని అడుగుతాం. అన్ని లెక్కలు తీస్తున్నాం.. 31శాతం వాటా ప్రకారం  కేంద్రం దాదాపు రూ.21వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. కార్మికులంతా రేపు ఉదయానికల్లా విధుల్లో చేరాలని.. వారికి ఎలాంటి షరతులు పెట్టడం లేదన్నారు. ఆర్టీసీ సంస్థలకు తాత్కాలికంగా రూ.100 కోట్లు మంజూరు చేస్తామన్నారు.

కాగా, ఆర్టీసీ సమ్మెతో కష్టాలు పడి ప్రత్యామ్నాయ రవాణాను ఆశ్రయించిన ప్రజలకు కొంత సహృదయంతో వారి సమస్యను అర్థం చేసుకుంటారని, టికెట్ చార్జీలను పెంచుతున్నామని చెప్పారు సీఎం. కిలోమీటరుకు 20పైసలు పెంచితే ఏడాదికి రూ.750 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని ఇది సంస్థను బలోపేతం చేయడానికి దోహదపడుతుందని చెప్పారు. వచ్చే సోమవారం నుంచి ఛార్జీలు పెంచుకునే అధికారం ఆర్టీసీ ఎండీకీ కల్పిస్తూ ఉత్తర్వులిస్తున్నామన్నారు. ఇప్పటికైనా కార్మికులు వాస్తవాలు తెలుసుకుని భవిష్యత్ లో ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని సూచించారు.

సమ్మె కారణంగా చనిపోయిన కార్మికుల కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటామన్నారు. కుటుంబంలో ఒకరికి ఆర్టీసీలో లేదా ప్రభుత్వంలో వారి అర్హతను బట్టి ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. తక్షణం వారి కుటుంబాలకు సాయాన్ని అందిస్తామని చెప్పారు. ఆర్టీసీ కార్మికులు తమను విశ్వసిస్తే.. సింగరేణి ఎలా తయారయ్యిందో అదే విధంగా ఆర్టీసీని ప్రగతిపథాన నడిపిస్తామని, కార్మికులు ప్రతీ ఏటా బోనస్ లు తీసుకునేలా చేస్తామని అన్నారు. యూనియన్ల స్థానంలో ప్రతి డిపోలో వర్కర్స్‌ వెల్ఫేర్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్మికులను కాదని ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోదని, కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుందామన్నారు. సంస్థ కార్మికులదని, దాని మనుగడతోనే కార్మికుల జీవితాలు ఇమిడి ఉన్నాయని త్వరలోనే ఆర్టీసీని అద్భుతంగా తీర్చిదిద్దుతామని కేసీఆర్ భరోసా కల్పించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TSRTC Workers  High Court  Routes Privatise  Jana Samiti  PIL  Ashwathama Reddy  TSRTC Strike  KCR  Hyderabad  Telangana  

Other Articles