Techie crushed to death by TSRTC bus ఆర్టీసీ బస్సు ఢీకొని సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మృతి..

Techie crushed to death by tsrtc bus angry mob thrashes driver

A woman software engineer working with Tata Consultancy Services in Mumbai was crushed to death under the wheels of a rashly driven TSRTC bus on Tuesday afternoon at Banjara Hills Road 12 in Hyderabad.

A woman software engineer working with Tata Consultancy Services in Mumbai was crushed to death under the wheels of a rashly driven TSRTC bus on Tuesday afternoon at Banjara Hills Road 12 in Hyderabad.

ఆర్టీసీ బస్సు ఢీకొని సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మృతి.. యువకుడి సెల్ఫీ పైత్యం

Posted: 11/26/2019 04:38 PM IST
Techie crushed to death by tsrtc bus angry mob thrashes driver

బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్ 12లో ఆర్టీసీ బస్సు బీభత్సం చేసింది. తాత్కాలిక డ్రైవర్ మరో నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాడు. స్కూటీపై వెళ్తున్న ఓ యువతిని ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొంది. మహిళ తల పైనుంచి బస్సు చక్రం వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. ప్రమాదంలో ఆమె తల నుజ్జనుజ్జయింది. తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మృతి చెందిన యువతిని టీసీఎస్ ఉద్యోగిని సోహిని సక్సేనా (26)గా గుర్తించారు. సోహిని మంగళవారం (నవంబర్ 26) మధ్యాహ్నం తన ద్విచక్రవాహనంపై మాసబ్ ట్యాంక్ నుంచి బంజారాహిల్స్ వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదానికి కారణమైన తాత్కాలిక డ్రైవర్‌ను స్థానికులు, వాహనదారులు పట్టుకొని దాడి చేశారు. దుస్తులు చించిమరీ చితకబాదారు. ఆగ్రహంతో ఆర్టీసీ బస్సుపై దాడి చేశారు. మృతదేహం వద్ద ఆందోళన నిర్వహించారు. ప్రమాదంతో మాసాబ్ ట్యాంక్ - పంజాగుట్ట, మెహిదీపట్నం మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అదే స్పాట్‌లో మూడేళ్లలో ఐదు సార్లు ఇదే తరహా ప్రమాదాలు చోటు చేసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని తాత్కాలిక డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో అతడు బర్కత్‌పుర డిపోలో గత నెల రోజులుగా తాత్కాలిక డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్న అనేక మంది వచ్చి ఏం జరిగిందోనంటూ అందోళనలో వుండగా.. ఒక యువకుడు మాత్రం తన పైత్యాన్ని ప్రదర్శించాడు. ఘటనాస్థలంలో తన చర్యలతో నెట్ జనులతో చివాట్లు తింటున్నాడు. సెల్ఫీలకు పరాకాష్టగా నిలిచాడు. మహిళా రోడ్డుపై విగతజీవిలా పడివుండగా, ఆమె తల కనబడకూడదని స్థానికులు ఓ కవర్ ను వేసినా.. ఎలాంటి అదురు, బెదురు లేకుండా.. కనీసం మానవత్వం లేకుండా అక్కడే నిలబడి యువకుడు ఫోటో తీయడం కెమెరాకు చిక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles