Devendra Fadnavis resigns after Ajit Pawar's U-turn ‘మహా’ రాజకీయం: పదవులకు ఫడ్నావిస్, అజిత్ రాజీనామా

Devendra fadnavis resigns after ajit pawar s u turn

BJP, Shiv Sena, Maharashtra President's rule, governor, Supreme Court, Bhagat Singh Koshyari, President's rule, Devendra Fadnavis, Ajit pawar, Adithya Thackeray, Uddhav Thackeray, power sharing formula, CM, Dy, CM, Minister portfolios, Sharad Pawar, Congress, bjp, congress, sonia gandhi, sharad pawar, sonia gandhi sharad pawar meeting, shiv sena, maharashtra govt formation, Maharashtra, Politics

In another twist, Devendra Fadnavis has resigned as the Maharashtra CM. Fadnavis’ resignation came after Ajit Pawar stepped down as the deputy chief minister ahead of tomorrow's floor test.

‘మహా’ రాజకీయం: పదవులకు ఫడ్నావిస్, అజిత్ రాజీనామా

Posted: 11/26/2019 03:49 PM IST
Devendra fadnavis resigns after ajit pawar s u turn

మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మలుపులు చోటుచేసుకుంటున్నాయి. బీజేపికి అచ్చంగా కర్ణాటకలో యడ్యూరప్పకు ఎదురైన పరిస్థితే ఏర్పడింది. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక్క రోజు వ్యవధిలో బీజేపి తమ బలాన్ని నిరూపించుకోవాలని చెప్పిన తరుణంలో బీజేపికి మద్దతునిచ్చిన ఎన్సీపీ రెబల్ అభ్యర్థి అజిత్ పవార్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తీర్పు వెలువడిన కొన్ని గంటల వ్యవధిలోనే మార్పులు సంభవించాయి. ఆయన వెంట ఎన్సీపీ అభ్యర్థులెవ్వరూ లేకపోవడం.. ఇక బీజేపితో కలిసే వుంటే తనకు రాజకీయ భవిష్యత్తు వుండదని భావించిన ఆయన యూటార్న్ తీసుకున్నారని వార్తలు వినబడతున్నాయి.

బల పరీక్షకు ముందు ఆయన్ను ఒప్పించడంలో శరద్‌ పవార్‌ చక్రం అటు పార్టీ పరంగానూ ఇటు కుటుంబపరంగానూ అజిత్ పై ఒత్తిడి తీసుకురావడంతో ఆయన వెనక్కి తగ్గినట్టు సమాచారం. పార్టీలోకి తిరిగి తీసుకొనేందుకు వీలుగా ఎన్సీపీ నుంచి అజిత్‌ను పవార్‌ సస్పెండ్‌ చేయలేదు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఫడణవీస్‌ నివాసానికి వెళ్లిన అజిత్ సీఎంతో భేటీ అయ్యారు. తాను రాజీనామా చేస్తున్నానని చెప్పడంలో తెలిపారు. ఈ పరిణామాలు చోటుచేసుకున్న వెనువెంటనే ముఖ్యమంత్రి పదవికి తాను కూడా రాజీనామా చేస్తున్నానని దేవేంద్ర ఫడ్నావిస్ ప్రకటించారు.

ఈ సందర్భంగా ఫడ్నావిస్ మాట్లాడుతూ.. మహారాష్ట్ర ఎన్నికలలో ఎన్డీయే కూటమికి ప్రజలు స్పష్టమైన మెజారిటీని ఇచ్చారని, బీజేపి పోటీచేసిన అనేక స్థానాల్లో గెలుపోంది 105 స్థానాల్లో గెలపించిందని అన్నారు. కాగా శివసేన పోటీచేసిన కేవలం 46 స్థానాల్లోనే గెలిచిందని చెప్పిన ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనతో పాటు మేము సిద్దమవుతున్న క్రమంలో ఆ పార్టీ బేరసారాలు నడిపిందని, ఎలాంటి హామీలు ఇవ్వకపోయినా తమపై బురదజల్లుతూ రెండున్నరేళ్ల కాలం పాటు అధికారం కావాలని డిమాండ్ చేసిందని ఆయన అన్నారు.

గవర్నర్ తమను ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచినా తాముకు అంత సంఖ్యాబలం లేదని చెప్పామని అన్నారు. అధికారమే పరమావధిగా బావించిన శివసేన తమను మోసం చేసిందని అరోపించారు. తమతో స్నేహబంధానికి వారే తలుపులు మూసివేసారన్న ఫడ్నావిస్.. ఇక ఇప్పుడు కాంగ్రెస్, రాష్ట్రవాదీ కాంగ్రెస్ తో కొనసాగుతున్నారని అన్నారు. అయితే ఎన్సీపి నుంచి అజిత్ పవార్ తమకు అండగా నిలుస్తారని వచ్చారని, అతని వెనుక మొత్తం ఎన్సీపి వస్తుందని ఆశించామని, అయితే చివరి నిమిషంలో ఆయన కూడా వెనక్కు తగ్గారని, కూటమిలో కొనసాగలేనని చెప్పారని అన్నారు. ఎమ్మెల్యేలను చీల్చలేనని, బేరసారాలకు పాల్పడలేనని అన్నారు. అందుకనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

జెండాలోనూ.. ఎజెండాలోనూ మూడు తద్భిన్నమైన పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయని, ఈ క్రమంలో ప్రభుత్వం చేత కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ కు బదులు కామన్ మాక్సిమమ్ ప్రోగ్రామ్ రచింపజేసి ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. తాము విపక్షంలోనే కూర్చుంటామని అన్నారు. గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం ప్రజల హితం కోసం చేసిన మంచి పనులను చేస్తూ వారి అధరాభిమానాలను పొందామని అన్నారు. మహారాష్ట్రలో ఏర్పడబోయే కూటమి ప్రభుత్వం అవలంభించే ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పుటికప్పుడు వ్యతిరేకిస్తామని దేవేంద్ర ఫడ్నావిస్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  shiv sena  ajit pawar  devendra fadnavis  bjp  congress  sonia gandhi  sharad pawar  Maharashtra  Politics  

Other Articles