Petrol prices up for fifth straight day హైదరాబాద్ లో రూ.80 చెంత చేరిన పెట్రోల్ ధర..

Petrol price now at its highest this year diesel rates stable

Petrol, Diesel, Petrol Price, Diesel Price, Today Petrol Price, Hyderabad, fuel price, petrol price hyderabad, Diesel price hyderabad, fuel cost today

The domestic fuel prices have recorded a mixed trend today (November 26). The petrol price has moved up By 11 paise, and diesel remains unchanged. With this, the petrol rate in Hyderabad has reached to Rs 79.56 per litre, and diesel remains constant at Rs 71.73 per litre.

హైదరాబాద్ లో రూ.80 చెంత చేరిన పెట్రోల్ ధర.. స్థిరంగా డీజిల్ ధర

Posted: 11/26/2019 02:27 PM IST
Petrol price now at its highest this year diesel rates stable

పెట్రోల్ ధరల దూకుడు ఇప్పట్లో ఆగేలా లేదు. వరుసగా ఐదవ రోజు పెట్రోల్‌ ధరలు పెరిగాయి. పైసా.. పైసా పెరుగుతూ రూపాయలకు చేరి వినియోగదారులకు షాక్‌ ఇస్తున్నాయి. తాజా పెరుగుదలతో పెట్రోల్ ధరలు ఏకంగా ఈ ఏడాది గరిష్ట ధరలను అందుకున్నాయి. ఇవాళ కూడా 11 పైసలు మేర పెరిగిన పెట్రోల్ ధర దేశంలోని పలు నగరాల్లో రూ.80 మార్కును దాటింది. ఢిల్లీ, కోల్ కతా, ముంబైలలో మంగళవారం పెట్రోల్‌ ధర లీటర్‌కు 11 పైసలు పెరిగింది. చెన్నైలో 12 పైసలు ఎగిసింది. డీజిల్‌ ధరలో ఎటువంటి మార్పు లేదు. గత ఐదు రోజుల్లో ఢిల్లీలో పెట్రోల్‌ ధర 58 పైసలు హెచ్చింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో ప్రభుత్వ రంగ ఆయిల్‌ కంపెనీలు ధరలు పెంచాయి.

తాజా పెరుగుదలతో పెట్రోల్‌ ధర ఏడాది గరిష్టానికి చేరుకుంది. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.79.56కు చేరింది. డీజిల్ ధర మాత్రం రూ.71.73 వద్దనే స్థిరంగా కొనసాగింది. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర 11 పైసలు పెరుగుదలతో రూ.79.12కు చేరింది. డీజిల్‌ ధర మాత్రం రూ.71.04 వద్దనే స్థిరంగా ఉంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 10 పైసలు పెరుగుదలతో రూ.78.75కు చేరింది. డీజిల్ ధర మాత్రం రూ.70.70 వద్ద నిలకడగా కొనసాగుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ ధర 10 పైసలు పెరుగుదలతో రూ.74.76కు చేరింది. డీజిల్ ధర మాత్రం రూ.65.73 వద్ద స్థిరంగా ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర 10 పైసలు పెరుగుదలతో రూ.80.42కు చేరింది. డీజిల్ ధర మాత్రం రూ.68.94 వద్దనే నిలకడగా కొనసాగుతోంది. పెట్రోల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. ముఖ్యంగా తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండటంతో ఉద్యోగులు, విద్యార్థులు, బయట పనులకు వెళ్లేవారు సొంత వాహనాలు ఎక్కువగా వాడుతున్నారు. ఆర్టీసీ సమ్మెకు తోడు, పెట్రోల్‌ ధరలు పెరగడంతో సామాన్యులు మరింత భారం మోయాల్సి వస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles