Restore security cover, Congress asks govt ‘‘గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత అంశం ముగిసింది.. కానీ’’: కేంద్రం

Matter closed govt sources on withdrawal of gandhis spg cover

SPG cover of Gandhi family, Z-plus security for gandhi family, Amit Shah, SPG Act of 1988, Sonia Gandhi, Rahul gandhi, Priyanka gandhi, Anand Sharma, congress, CRPF, jp nadda, Priyanka Gandhi Vadra, SPG cover, Parliament, Politics

The government has said there is no going back on the decision to withdraw the SPG cover provided to the Gandhi family even as the Congress took up the issue both inside Parliament and outside. “The matter is closed... Congress can keep asking questions,” the Top home ministry sources said.

‘‘గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత అంశం ముగిసింది.. కానీ’’: కేంద్రం

Posted: 11/20/2019 03:24 PM IST
Matter closed govt sources on withdrawal of gandhis spg cover

కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, గాంధీ కుటుంబంగా పేరుగాంచిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలకు గత 28 ఏళ్ళుగా కొనసాగించిన భద్రతను కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం కుదించి.. అంతకుపూర్వం వున్న జడ్ ప్లస్ భద్రతను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ అంశమై ఇటు పార్లమెంటు లోపలా, వెలుపల ఆందోళనకు దిగుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఈ అంశంపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు స్పందించారు.

గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత ముగిసిన అంశంగా కేంద్రహోం మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. అయితే ఈ అంశంలో కాంగ్రెస్ ప్రశ్నలను సంధించవచ్చునని కేంద్ర వర్గాలు స్పష్టం చేశాయి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ తీవ్రవాదులు హత్యచేసిన నేపథ్యంలో 1991 మే 21 నుంచి సోనియాగాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు ఎస్పీజీ భద్రత కల్పించారు. కాగా అప్పటి నుంచి ఈ ఏడాది నవంబర్ 8 వరకు కొనసాగింది. నవంబర్ 8న గాంధీ కుటుంబ భద్రతను కుదిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.

కాగా ఇదే అంశాన్ని ఇవాళ రాజ్యసభలో ప్రస్తావించిన కేంద్రమాజీ మంత్రి ఆనంద్ శర్.. రాజీవ్ గాంధీ హత్యోదంతం తరువాత అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భధ్రత కల్పించారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం అధికారంలో వున్న అదే ఎన్డీయే ప్రభుత్వం మాత్రం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని అరోపించారు. గాంధీ కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. దీనికి కేంద్రమంత్రి జేపీ నడ్డా బదులిస్తూ ఈ నిర్ణయంలో ఎలాంటి రాజకీయ కారణాలు లేవు, కక్షపూరిత చర్యలు అంతకన్నా లేవని వివరించారు. ఇక గాంధీ కుటుంబానికి భద్రతను ఎత్తివేయలేదని కూడా స్పష్టం చేశారు.

గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత ఎత్తివేసిన నేపథ్యంలో జడ్‌ ప్లస్ సెక్యూరిటీ అమల్లోకి వచ్చింది. దీంతో వారి భద్రత కల్పించే దళాల కోసం పదేళ్ల క్రితం నాటి వాహనాలను కేటాయించారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకు బదులు 2010 మోడల్ టాటా సఫారీ వాహనాలను కేంద్రం కేటాయించింది. ఈ వాహనాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోనియా కుటుంబానికి బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించాలని కోరినప్పటికీ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదని తెలుస్తోంది. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య తర్వాత సోనియా కుటుంబానికి ఎస్‌పీజీ భద్రత కల్పించారు. ఇప్పుడు దానిని తొలగించి జడ్‌ప్లస్ భద్రతను కేటాయించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles