Caste row: YSRC MLA to face inquiry! ఎమ్మెల్యే శ్రీదేవికి ఈసీ షాక్.. విచారణ రావాలన్న జేసీ..

Guntur jc issues notice to ysrcp mla on caste allegations

Sridevi, YSRCP, Shedule Caste, Christian, Election Commission, Legal Right Protection Forum, Santosh, Shravan Kumar, TDP, Andhra Pradesh, Politics

The state election chief has ordered that an inquiry be held on Thadikonda MLA Vundavalli Sridevi caste. In the 2019 elections, Vudavalli Sridevi from Tadikonda constituency contested on behalf of YSRCP and won over her opponent and TDP candidate Shravan Kumar.

ఎమ్మెల్యే శ్రీదేవికి ఈసీ షాక్.. విచారణ రావాలన్న జేసీ..

Posted: 11/19/2019 12:42 PM IST
Guntur jc issues notice to ysrcp mla on caste allegations

గుంటూరు జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఎన్నికల కమీషనర్ షాక్ ఇచ్చారు. జిల్లాలోని తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై ఎన్నికల కమీషన్ అధికారులు విచారణకు ఆదేశించింది. అమె కులం విషయంలో రేగిన వివాదం స్థబ్దుగా పరిష్కరించాలన్న చేసిన యత్నాలు విఫలమయ్యాయి. అంతేకాదు.. ఏకంగా ప్రభుత్వ ఉన్నతాధికారుల బదిలీకే కారణమయ్యింది. ఇప్పటికే ఈ అంశంలో నిజాలను నిర్థారించి నివేదికను పంపాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కార్యాలయం నుంచి అదేశాలు వచ్చాయి.

తాజాగా ఎన్నికల కమీషన్ అదేశాల నేపథ్యంలో గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అమె కుల ధృవీకరణ అంశంలో విచారణ జరపనున్నారు. శ్రీదేవి ఎస్సీ సామాజికి వర్గానికి చెందిన వ్యక్తా? కాదా? అనే విషయంపై విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేశ్ కుమార్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా జేసీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి తాఖీదులు పంపారు. ఈ నెల 26న మధ్యాహ్నం మూడు గంటలకు గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో జరిగే విచారణకు తప్పక హజారుకావాలని నోటీసులలో పేర్కోన్నారు.

విచారణ నేపథ్యంలో అమె.. తాను షెడ్యూలు కులానికి చెందిన వ్యక్తినేనని నిరూపించుకునేందుకు అవసరమైన పత్రాలను తీసుకురావాలని సూచించారు. ఈ విచారణకు అమె ఒంటరిగా వచ్చినా.. లేదా అమె తన తల్లిదండ్రులను లేదా రక్త సంబంధికులను తీసుకుని రావచ్చునని కూడా జేసీ నోటీసులలో పేర్కోన్నారు. ఎమ్మెల్యే శ్రీదేవి ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి కాదంటూ అభియోగాలను నమోదు చేసిన కాఫీని, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి జారీ చేసీన నోటీసుల ప్రతిని కూడా అమెకు నోటీసులతో జతచేసి పంపించారు. కాగా, ఈ విచారణకు హాజరుకాని పక్షంలో ప్రత్యర్థి అరోపణలను పరిగణలోకి తీసుకుని దాని ప్రకారమే నివేదిక రూపొందించి స్ర్కూటినీ కమిటీ పంపుతుందని పేర్కోన్నారు.

tatikonda sridevi mla

అసలేం జరిగింది.? అన్న వివరాల్లోకి వెళ్తే ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఓ ఇంటర్వ్యూలో తాను క్రిస్టియన్ అని శ్రీదేవి చెప్పుకోవడం అసలు వివాదానికి దారి తీసింది. అమె క్రిస్టియన్ అని బాహాటంగా చెప్పుకున్న అంశాన్ని ప్రస్తావిస్తూ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తరపున సంతోష్ అనే వ్యక్తి.. అమె శాసనసభ సభ్యత్వాన్ని సవాలు చేస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఫిర్యాదు చేశారు. క్రిస్టియన్ అయిన శ్రీదేవికి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అర్హత లేదని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం... ఈ అంశంపై విచారణ జరపాలంటూ ఎన్నికల కమిషన్ కు ఆదేశాలు జారీ చేసింది.

ఇక అంతటితో ఆగని శ్రీదేవి అంశం ఉరుము ఉరిమి మంగళం మీద పడట్టు.. అన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీకి కూడా కారణమైందన్న వార్తలు వినబడ్డాయి. రాష్ట్రపతి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఈ అంశాన్ని స్దబ్దుగా సర్థుకునేట్లు చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు బెడిసికట్టాయని కూడా అరోపణలు వచ్చాయి. తాను అబద్దాలను రాయలేనని.. స్పష్టం చేయడంతోనే సీఎస్ గా వున్న ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ఆ పదవి నుంచి బదిలీ చేశారని కూడా వార్తలువచ్చాయి. దీంతో మరో రెండు మాసాల్లో పదవీ విరమణ చేయాల్సిన సుబ్రహ్మణ్యం.. నెల రోజుల పాటు సెలవుపై వెళ్లారని కూడా సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles