Rs 10 lakh stolen from AP MLA's office వైసీపీ ఎమ్మెల్యే ఆఫీసు నుంచి రూ. 10లక్షల చోరీ

Rs 10 lakh stolen from mangalagiri mla ramakrishna reddy s office

Mangalagiri MLA office robbed, Rs 10 lakh, Mangalagiri YCP MLA, Ramakrishna Reddy, Mangalagiri MLA Office, Mangalagiri, andhra pradesh, politics

Unidentified miscreants decamped with Rs 10 lakh from the office of YSRC MLA Alla Ramakrishna Reddy in Mangalagiri of Guntur district on Monday at midnight.

వైసీపీ ఎమ్మెల్యే ఆఫీసు నుంచి రూ. 10లక్షల చోరీ

Posted: 11/19/2019 11:47 AM IST
Rs 10 lakh stolen from mangalagiri mla ramakrishna reddy s office

ఆంధ్ర్రప్రదేశ్ అధికార ఎమ్మెల్యే కార్యాలయంలో చోరీ జరిగింది. గుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వైసీపీ ఎమ్మెల్యే పలు సంక్షేమ కార్యక్రమాల కోసం తీసుకువచ్చిన డబ్బు అపహరణకు గురైంది. నిత్యం కార్యకర్తలతో పాటు కార్యాలయ సిబ్బంది వుండే ఆఫీసు నుంచి ఏకంగా పది లక్షల రూపాయలు అపహరణకు గురికావడం సిబ్బందిని షాక్ కు గురిచేసింది. కంగారుపడిన సిబ్బంది కార్యాలయంలో క్షుణ్ణంగా అన్వేషించినా.. ఫలితం శన్యూం.

తమ అన్వేషణ ప్రయత్నాలకు స్వస్తి పలికిన సిబ్బంది.. డబ్బు దొంగతనం జరిగిందని గ్రహించి పోలీసులకు సమాచారం అందించారు. తమ నియోజకవర్గ పరిధిలో సంక్షేమ కార్యక్రమాల కోసం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి ఆదేశాల మేరకు డబ్బు తీసుకువచ్చి.. ఆఫీసులో ఉంచామని సిబ్బంది తెలిపారు. అయితే ఇదివరకు కూడా.. మరుసటి రోజు ఉదయాన్నే చేపట్టే కార్యక్రమాల నేపథ్యంలో ఒకటి రెండు పర్యాయాలు ఇలా డబ్బును తీసుకువచ్చి ఆఫీసులో పెట్టామని, అయితే ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని సిబ్బంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ ఎమ్మెల్యే కార్యాలయం నుంచి డబ్బు చోరీపై వైఎస్సార్సీపీ నేత జూపూడి జాన్సన్‌ మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు. కార్యాలయంలో పనిచేసిన వారే సొమ్మును అపహరించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఆఫీసుతో పాటూ చుట్టు పక్కల ఉన్న సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఈ దొంగతనం వ్యవహారంపై ఆరా తీశారు. ఈ చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles