Shiv Sena to hold meeting on BJP's new formula శివసేనకు ఢిప్యూటీ, 14 మంత్రులు.. బీజేపి కొత్త రాజీ ప్లాన్ ఫలించేనా.?

Bjp willing to give dy cm post upto 15 cabinet berths to shiv sena reports

BJP, Shiv Sena, Devendra Fadnavis, Adithya Thackeray, Uddhav Thackeray, power sharing formula, CM, Dy, CM, Minister portfolios, Sharad Pawar, Congress, Assembly Elections 2019, Maharashtra Assembly Polls 2019, Current Affairs, India, Maharashtra, Politics

According to reports, while Devendra Fadnavis - who was elected as BJP’s Legislative Party leader on October 30 - may remain the chief minister for a full five year-term, the Shiv Sena to get the post of Deputy Chief Minister and as many as 14 cabinet portfolios

శివసేనకు ఢిప్యూటీ, 14 మంత్రులు.. బీజేపి కొత్త రాజీ ప్లాన్ ఫలించేనా.?

Posted: 10/31/2019 02:51 PM IST
Bjp willing to give dy cm post upto 15 cabinet berths to shiv sena reports

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనా.. అటు మిత్రఫక్షం శివసేన అధికార పంపకంపై బెట్టువీడకపోవడంతో మిత్రపక్షాల మధ్య ఎలా రాజీ కుదురుతుందా.? అన్న ఆసక్తి సర్వత్రా కొనసాగుతోంది. ఇక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటే బీజేపికి.. తమ మిత్రపక్షం శివసేన మద్దతు తప్పనిసరి. అయితే, అధికార పంపకానికి మాత్రం బీజేపి నో అని తేల్చిచెబుతోంది. అధికార పంపకం అనే ఫార్ములా ఫాలో అయితే ప్రజల్లో విశ్వసనీయత వుండదని తెగేసి చెబుతోంది.

ఇది యూపీఏ అందులోనూ కాంగ్రెస్ అవలంభించే ఫార్ములాను ఎలా వాడుకుంటామని ప్రశ్నిస్తున్న బీజేపి.. మధ్యే మార్గాన్ని అవలంభించనున్నట్టు తెలుస్తోంది. మిత్రపక్షానికి డిప్యూటీ సీఎం పదవి సహా, 13 మంత్రి పదవులను ఇవ్వాలని బీజేపీ నిర్ణయించినట్టు సమాచారం. ప్రభుత్వ ఏర్పాటుపై వీలైనంత త్వరగా శివసేనతో తమ పార్టీ అధినాయకత్వం సంప్రదింపులు జరుపుతుందని ఫడ్నవీస్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శివసేన ఎంపీ, సామ్నా పత్రిక ఎడిటర్ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఒకవేళ మహారాష్ట్రలో బీజేపీ-శివసేన ప్రభుత్వం ఏర్పడితే సంతోషమే అని అన్నారు.

కాగా, శివసేన శాసనసభా పక్షం హై లెవల్ సమావేశంలో భవిష్యత్ కార్యచరణపై సమావేశం కానుంది. మంత్రి పదవుల్లో 26 బీజేపీ ఉంచుకుని 13 శివసేనకు ఇవ్వాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. రెవెన్యూ, ఆర్థిక, హోం, పట్టణాభివృద్ధి లాంటి కీలక శాఖలను బీజేపీ తనవద్దే అట్టుపెట్టుకుంటుందని తెలిపాయి. బీజేపీ ప్రతిపాదనలపై ఆచితూచి స్పందించాలని శివసేన భావిస్తోంది. తమకు ఎన్ని క్యాబినెట్, సహాయ మంత్రి పదవులు దక్కుతాయని.. దాని ప్రకారమే ముందుకు వెళ్లాలని భావిస్తోంది. గత ప్రభుత్వంలో ఐదు క్యాబినెట్, ఏడు సహాయక మంత్రి పదవులను శివసేనకు ఇచ్చామని, ఈసారి వాటి సంఖ్య పెరిగే అవకాశం ఉందని బీజేపీకి చెందిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles