pawan kalyan extends support to TSRTC strike ఆర్టీసీ కార్మికుల కార్యచరణకు జనసేన మద్దతు

Pawan kalyan janasena extends support to tsrtc strike

TSRTC Workers, TSRTC Strike, pawan Kalyan, Jana Sena, TJAC agitation, High Court, workers apology, RTC employees apologize, tsrtc jac, Telangana movement, Ashwathama Reddy, TSRTC, TSRTC Workers, TSRTC Workers Strong Warning, Telangana Bandh, ts government

Jana Sena party chief Pawan Kalyan too extends his party support to Telangana TSRTC Employees Strike. The power star says if CM KCR doesn't take any iniative in this regard, his party also extend support to all the agitations decided by TJAC.

ఆర్టీసీ కార్మికుల కార్యచరణకు సంపూర్ణ మద్దతు: పవన్ కల్యాణ్

Posted: 10/31/2019 04:02 PM IST
Pawan kalyan janasena extends support to tsrtc strike

తెలంగాణలో అర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె 27వ రోజుకు చేరినా.. సమ్మెను కార్మికులు ఉపసంహంరించుకునే చర్యలను తీసుకోని ప్రభుత్వం తీరుపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రోజు రోజుకు మరణాల సంభవిస్తున్నా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు పట్టనట్టు వ్యవహరిస్తోందో అర్థం కావడం లేదని ఆయన మండిప్డారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పై తనకు గట్టి నమ్మకం ఉందని, కార్మికులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయమై సీఎం కేసీఆర్ తో మాట్లాడతానని, అప్పటికీ కేసీఆర్ పట్టించుకోకపోతే ఆర్టీసీ కార్మికులు భవిష్యత్ లో నిర్వహించే కార్యక్రమాలకు తాను పూర్తిగా మద్దతు ఇస్తానని వెల్లడించారు. 27 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉండడం బాధాకరమైన విషయం అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అశ్వత్థామరెడ్డి నేతృత్వంలో తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు ఈ మధ్యాహ్నం పవన్ కల్యాణ్ ను బంజారాహిల్స్ లోని జనసేన కార్యాలయంలో కలిశారు. సమ్మెకు మద్దతుగా నిలవాలని కోరగా, పవన్ సానుకూల ధోరణి ప్రదర్శించినట్టు తెలుస్తోంది.

గీతాంజలి మరణం బాధాకరం: పవన్ కల్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సీనియర్ నటి, అలనాటి హీరోయిన్ గీతాంజలి రామకృష్ణ మరణం బాధాకరమని పవన్ కల్యాణ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అమె పేరు చెబితే చాలు సీతాదేవి గుర్తుకు వస్తుందని అన్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ అమె తన నటనా ప్రావిణ్యాన్ని ప్రదర్శించారని పవన్ పేర్కోన్నారు. అమెతో వున్న అనుబంధాన్ని వెల్లడిస్తూ.. తాము చెన్నైలో ఉన్నప్పుడు గీతాంజలి కుటుంబానికి చెందిన శ్రీనివాస థియేటర్స్ వెళ్లేవారమని, అక్కడ ఆమె కుటుంబ సభ్యులను కలిసేవాళ్లమన్నారు. హైదరాబాద్ వచ్చినా.. అనుబంధాన్ని అలాగే కొనసాగిందని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని, ఆమె కుటుంబ సభ్యులకు తన తరఫున, జనసైనికుల తరఫున ప్రగాడ సానుభూతి తెలుపుకుంటున్నట్టు మీడియా ప్రకటనలో పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles