Fire Accident at Shine Hospital Kills One Child షైన్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం ..

Fire accident at shine hospital kills one child

Shine Hospital, Fire Accident, Hyderabad

Fire Accident at Shine Hospital Kill One Child

షైన్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం ..

Posted: 10/22/2019 11:13 AM IST
Fire accident at shine hospital kills one child

(Image source from: thenewsminute.com)

ఆస్పత్రులు వైద్యం అందించడంలోనే కాదు.. రోగులకు భద్రత ఇవ్వడంలోనూ విఫలం అవుతున్నాయి. ఆస్పత్రుల్లో అనుకోని ఘటనలు ఎదురైతే రోగులు, వారి బంధువులను కాపాడేందుకు కూడా వీలు లేకుండా నిర్మాణాలు ఉంటున్నాయి. అసలు అనేక ఆస్పత్రులు అగ్ని ప్రమాద రక్షణ వ్యవస్థలే లేకుండా నడుస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌ ఎల్‌బీనగర్‌లోని షైన్‌ ఆసుపత్రి పై అంతస్తులో సోమవారం తెల్లవారుజామున  2.40 గంటలకు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయిదుగురు చిన్నారులు అదే అంతస్తులో ఇంక్యుబేటర్లపై చికిత్సపొందుతున్నారు. అకస్మాత్తుగా మంటలు చెలరేగి చిన్నారుల ఛాతి, పొట్ట, ముఖం భాగాలు కమిలిపోయాయి. ఈ ప్రమాదంలో 4 నెలల మగ శిశువు మృతిచెందాడు. మరో ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంకో శిశువు పొగ పీల్చడంతో అస్వస్థతకు గురయ్యాడు. ఈ నలుగురిని అత్యవసర చికిత్స కోసం నగరంలోని వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. ముగ్గురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు ఆస్పత్రిలో జనరల్‌ వార్డులో మరో 34 మంది వరకూ చికిత్స పొందుతున్నారు.

ఆసుపత్రిలో ఇటీవల కాలంలో రెండుసార్లు షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి పొగలు వచ్చినట్లు రోగులు చెబుతున్నారు. మూడు రోజుల క్రితం కూడా ఇలాగే పొగలు వస్తే సిబ్బంది సరిచేశారని వివరించారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి ప్రమాదాన్ని కూడా సిబ్బంది తేలిగ్గా తీసుకున్నారని.. కానీ, మంటలు చెలరేగడంతో ఇంత దారుణం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రిజ్‌ వెనుక భాగంలో షార్ట్‌ సర్క్యూట్‌ అవడం వల్లే మంటలు చెలరేగినట్టు భావిస్తున్నామని పోలీసులు చెప్పారు. మృతి చెందిన శిశువు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు 304ఏ సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి.. ఆస్పత్రి ఎండీ సునీల్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అలాగే.. ఆస్పత్రి యాజమాన్యానికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం నోటీసులు జారీ చేసింది. కాగా.. వైద్య మంత్రి ఈటల ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. దీంతో ప్రజారోగ్య సంచాలకుడు ఒక విచారణ అధికారిని నియమించి 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని సూచించారు.

రాష్ట్రంలోని చాలా ఆస్పత్రులు ఇరుకైన గదుల్లో ఉంటున్నాయి. అందులోనూ గాలీ వెలుతురు వచ్చే అవకాశం లేని కిటికీలు, అత్యవసర పరిస్థితి తలెత్తితే బయటకు వెళ్లలేని స్థితుల్లో ఆస్పత్రుల నిర్మాణాలుంటున్నాయి. అగ్ని ప్రమాదం సంభవిస్తే సాధారణ పౌరుల మాదిరిగా రోగులు ఉరుకులు పరుగులు తీసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆస్పత్రుల్లో అత్యంత ప్రత్యేకమైన నివారణ చర్యలు తీసుకోవాలి. షైన్‌ ఆస్పత్రిలో నెలల చిన్నారి ఎటు పరిగెత్తగలదు? ఎంతో కీలకమైన ఆస్పత్రుల్లో కనీస ప్రమాదం నివారణ చర్యలే లేవంటే ఎంత దారుణం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shine Hospital  Fire Accident  Hyderabad  

Other Articles

Today on Telugu Wishesh