Mohammad Azaruddin likely to join TRS కారులో షికారుకు సిద్దమవుతున్న అజార్

Mohammad azaruddin likely to join trs after meet with kcr

HCA, Hyderabad Cricket Association, Mohammad Azharuddin, Minister, CM KCR, KTR, HCA President Elections, Telangana, Politics, cricket, sports

Former Team India Captain Mohammad Azaruddin is all set to join ruling party TRS after he had won the presidential post of Hyderabad cricket association with the support of TRS party.

కారులో షికారుకు సిద్దమవుతున్న అజారుద్దీన్.?

Posted: 09/28/2019 04:45 PM IST
Mohammad azaruddin likely to join trs after meet with kcr

టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన మహమ్మద్ అజారుద్దీన్కారులో షికారు చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారా.? అంటే ఔనన్న సమాధానాలే వినిపిస్తున్నాయి. హెచ్సీఏ అద్యక్షుడిగా నిన్ననే ఎన్నికైన ఆయన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను కలవడంతో ప్రస్తుతం ఇదే ప్రచారం అటు మీడియాలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది. హెచ్‌సీఏ ఎన్నికల్లో విజయానికి సహకరించినందుకు మర్యాదపూర్వకంగా ఆయనతో భేటీ అయ్యారని అజారుద్దీన్ సన్నిహితులు చెబుతున్నారు.

అయితే ఆజార్ మాత్రం త్వరలోనే రాస్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తోనూ భేటీ అవుతారని తెలుస్తోంది. కేటీఆర్ తో భేటీ ద్వారా అజారుద్దీన్ టీఆర్ఎస్ లో చేరికకు సంకేతాలిచ్చినట్టయింది. నిజానికి హెచ్‌సీఏ ఎన్నికలకు ముందే టీఆర్ఎస్‌తో అజారుద్దీన్ సంప్రదింపులు జరిపారు. ఎన్నికల్లో తనకు మద్దతునిస్తే.. గెలిచాక టీఆర్ఎస్‌లో చేరుతానని అజారుద్దీన్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ మద్దతుతో అజారుద్దీన్ విజయం నల్లేరుపై నడకగా సాగింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్‌కు ఇచ్చిన మాట మేరకు అజారుద్దీన్ ఆ పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీలో తనకు సరైన గుర్తింపు దక్కలేదని భావిస్తున్న అజారుద్దీన్.. కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇదే క్రమంలో హెచ్‌సీఏ ఎన్నికల్లో గెలుపు కోసం ఆయన టీఆర్ఎస్‌కు దగ్గరయ్యారు. ఇచ్చిన మాట ప్రకారం తనకు మద్దతు తెలిపి ఎన్నికల్లో విజయానికి కారణమవడంతో టీఆర్ఎస్‌లో చేరేందుకు ఆయన సుముఖంగా ఉన్నట్టు సమాచారం. ఇక రేపో మాపో ఆయన టీఆర్ఎస్ లో చేరడం లాంఛనమే అన్న ప్రచారం జరుగుతోంది. అజారుద్దీన్ తన భవిష్యత్ రాజకీయాలను ఆయన టీఆర్ఎస్‌లో వెతుక్కోబోతున్నారన్న వార్తలు ఎంతవరకు నిజమౌతాయో వేచిచూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : HCA  Mohammad Azharuddin  CM KCR  KTR  HCA Presidential Elections  Telangana  Politics  

Other Articles

Today on Telugu Wishesh