PM Modi applauded for his speech at UN ప్రధాని ప్రసంగంపై ప్రశంసలు.. మోడీ ఖ్యతి నలుదిశలా వ్యాప్తి..

Top political leaders applaud pm modi for his speech at un

narendra modi,prime minister narendra modi,howdy modi,narendra modi speech,narendra modi latest,narendra modi interview,modi,modi in us,pm modi,narendra modi movie trailer,narendra modi houston,narendra modi usa trip,pm narendra modi with us president barack obama,narendra modi in usa,narendra modi youtube,pm narendra modi,narendra modi madison square,narendra modi degree,narenda modi

Prime Minister Narendra Modi's speech at the 74th session of the United Nations General Assembly (UNGA) has gathered praise from some prominent political leaders from across the globe.

ప్రధాని ప్రసంగంపై ప్రశంసలు.. మోడీ ఖ్యతి నలుదిశలా వ్యాప్తి..

Posted: 09/28/2019 03:53 PM IST
Top political leaders applaud pm modi for his speech at un

ఇన్నాళ్లూ జీ20, జీ4 గ్రూపుల్లో సంపన్న దేశాలు చెప్పే అంశాల్ని, చేసే ఆదేశాల్నీ భారత్ సహా ప్రపంచ దేశాలు పాటించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. భారత్ లాంటి దేశాలు అభివృద్ధిలో, ప్రపంచాన్ని ముందుకు నడిపించడంలో ముందడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా ఇండియా తీసుకుంటున్న నిర్ణయాలు, వేస్తున్న అడుగులూ ప్రపంచ దేశాలను ఇండియా వైపు వారి దృష్టిని అకర్షించేలా చేస్తున్నాయి. ఇక ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ భారత హద్దులు దాటి అసియా ఖండముతో పాటు అంతర్జాతీయంగా కూడా ఖ్యాతి సంపాదిస్తున్నారు.

ఇందిరాగాంధీ తరువాత ఆ స్థాయిని తన భారత ప్రధానిగా సొంతం చేసుకుంటున్న ప్రధాని మోడీ.. అనేక దేశాల్లో పర్యటిస్తూ వారితో సత్సంబంధాలను ఏర్పర్చుకుంటున్నారు. అగ్రరాజ్యం అమెరికా, చైనా, రష్యా లాంటి పెద్ద దేశాలతో ఆయన చేస్తున్న దౌత్యం, స్నేహం సత్ఫలితాలను ఇస్తున్నాయి. తాజాగా హౌడీ మోదీ సభ, ఐక్యరాజ్యసమితి పర్యావరణ సదస్సు, ఐరాస భద్రతామండలి 74వ సదస్సులో ప్రధాని మోదీ చేసిన ప్రసంగాలకు ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పర్యటనతో భారత ఖ్యాతి మరింత ఇనుమడిస్తోంది.

ఐరాస భద్రతా మండలిలో ప్రధాని మోదీ.. నరుడిలో నారాయణుడిని చూడటం భారత దేశ సంస్కృతి అని ప్రసంగించారు. ఆయన ముగియగానే... గ్రీస్, మారిషస్, సింగపూర్ ఇలా చాలా దేశాల అధినేతలు.. మోదీ ప్రసంగాన్ని ప్రశంసించారు. ఆయనతో కలిసి సెల్ఫీలు దిగేందుకు అక్కడి అతిరధులు క్యూ కట్టారు. ప్రపంచ దేశాలకు నచ్చాలనో, అవి మెచ్చాలనో ప్రధాని తన ప్రసంగాల్లో ఎలాంటి రాజీలూ పడలేదు. కాశ్మీర్ అంశంలో భారత్ అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టారు. 130 కోట్ల మంది భారతీయులు కోరుకుంటున్నట్లు కాశ్మీర్‌ భారత్లో భాగమని స్పష్టం చేశారు.

ఐరాస సాధారణ సదస్సులో కూడా మోదీ బలమైన వాదన వినిపించారు. వాతావరణ మార్పులు, ప్రపంచ ఆరోగ్యం, ఉగ్రవాదంపై పోరు అంశాల్లో భారత్ తీసుకుంటున్న చర్యల్ని ఆయన ప్రపంచదేశాలకు వివరించారు. తద్వారా ప్రపంచదేశాలకు ఇండియా పట్ల సానుకూల అభిప్రాయం కలిగేందుకు కృషిచేశారు. అందువల్లే గాంధీజీ 150వ పుట్టిన రోజు (అక్టోబర్ 2న)కు గుర్తుగా ముందస్తుగా జరిపిన 150 మొక్కలు నాటే కార్యక్రమంలో సింగపూర్, భూటాన్, న్యూజిలాండ్, జమైకా, బంగ్లాదేశ్ తదితర దేశాల అధినేతలు లేదా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

అమెరికా పర్యటనలో మోదీ... పసిఫిక్ ఐలాండ్ దేశాలు, కరీబియన్ దేశాలు, భూటాన్, బంగ్లాదేశ్ అధినేతలతో భేటీ అయ్యారు. అమెరికా, ఎస్తోనియా, న్యూజిలాండ్, ఇరాన్ దేశాలతో వేర్వేరు అంశాలపై చర్చించారు. ఆర్మేనియా, గ్రీస్, సైప్రస్ దేశాల అధినేతలతో మాట్లాడారు. టర్కీ మాత్రం పాకిస్థాన్ వైపు మొగ్గు చూపింది. పెద్దన్నగా వ్యవహరించే అమెరికా... పూర్తిగా ప్రధాని మోదీ, ఇండియాకి సపోర్ట్‌గా నిలిచింది. మొత్తంగా ఇండియాకి ప్రధాని మోదీ టూర్ ఎంతగానో కలిసొస్తోంది. ఫార్చ్యూన్ 500 కంపెనీలు భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prime Minister  Narendra Modi  United Nations  United States  Howdy modi  Houston  

Other Articles