Sharad Pawar to visit ED Mumbai office ఈడీ విచారణకు శరద్ పవార్.. ముంబై పోలీసుల అలర్ట్

Sharad pawar to visit ed mumbai office in money laundering case

sharad pawar, sharad pawar money laundering case, sharad pawar live updates, sharad pawar ed case, Maharashtra State Cooperative Bank, ED, Mumbai Police, Maharashtra, Politics

NCP chief Sharad Pawar’s visit to the Mumbai office, the police have imposed prohibitory orders outside the Enforcement Directorate's office after he is named in a money-laundering case in connection with a scam at Maharashtra State Cooperative Bank

ఈడీ విచారణకు హాజరకానున్న శరద్ పవార్.. ముంబై పోలీసుల అలర్ట్

Posted: 09/27/2019 11:57 AM IST
Sharad pawar to visit ed mumbai office in money laundering case

మహారాష్ట్ర స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకులో అవకతవకలకు పాల్పడటంతో పాటు వాటి నిధులను దారిమళ్లించారన్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అభియోగాలపై వివరణ ఇచ్చేందుకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇవాళ ఈడీ ఎదుట హాజరుకానున్నారు. అయితే ఆయన నిధులు మళ్లించడంతో మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని అభియోగాలు మోసిన ఈడీ.. ఆయనకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు, అంతేకాదు విచారణకు హాజరుకావాలని కూడా ఎలాంటి సమన్లు పంపలేదు. అయినా తనపై వచ్చిన అభియోగాల నేపథ్యంలో ఎన్సీపి అధినేత శరద్ పవార్ తానే స్వయంగా ముంబైలోని ఈడీ కార్యాలయానికి వస్తానని చెప్పారు.

అయితే ఈ విషయంలో కాసింత మిమాంసలో పడిన ఈడీ.. ఇప్పడే కాదని.. సమయం వచ్చినప్పుడు తామే పిలుస్తామని కూడా కబురు పంపింది. అయినా తనపై అభియోగాలు మోపిన నేపథ్యంలో తాను విచారణకు కాదు వివరణ ఇస్తానని అభియోగాలోంటే అధికారులే చెప్పాలని శరద్ పవార్ అన్నారు. ఎన్సీపీ అధినేత పవార్ ఈడీ కార్యాలయానికి వస్తున్న నేపథ్యంలో ముంబై పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎన్సీపీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో చేరుకునే అవకాశముందని భావించిన పోలీసులు ముంబైలో ఆంక్షలను విధించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడరాదని ఆంక్షలు విధించారు.

వాస్తవానికి శరద్ పవార్ కు ఇంత వరకు ఈడీ సమన్లు పంపలేదు. కానీ, మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో, రానున్న రోజుల్లో ప్రచారానికి సంబంధించి బిజీ కాబోతున్న నేపథ్యంలో... ఆయనే తనంతట తానుగా ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో పోలీసులు సెక్షన్ 144 విధించారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నట్టు శరద్ పవార్ నిన్న ట్వీట్ చేశారు. ఈడీ కార్యాలయం వద్దకు ఎవరూ రావద్దంటూ పార్టీ శ్రేణులకు ఆయన విన్నవించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles