States can revise fines under MVI Act: Centre కొత్త ట్రాఫిక్ ఫైన్లపై దిగివచ్చిన కేంద్రం.. రాష్ట్రాలదే నిర్ణయం..

States will be responsible says nitin gadkari on diluting road fines

BJP ruling stated U turn on MVI fines, MVI amendment act, New fines for traffic violations, Nitin Gadkari, Motor Vehicles Act, Traffic Violations. Ammendment fines, States, challans

States will be responsible if they try to dilute traffic violation fines, Union Minister Nitin Gadkari said as the ruling BJP was embarrassed by its own government in Gujarat slashing fines under an amended law cleared by parliament recently.

కొత్త ట్రాఫిక్ ఫైన్లపై దిగివచ్చిన కేంద్రం.. రాష్ట్రాలదే నిర్ణయం..

Posted: 09/12/2019 12:28 PM IST
States will be responsible says nitin gadkari on diluting road fines

మోటార్ వాహనాల చట్టానికి సవరణలు చేసిన కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చి.. వాహనదారులపై భారీ జరిమానాలు విధించడంపై షోషల్ మీడియా వేదికగా అనేక విమర్శలు వెల్లివిరయడంతో ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. ఈ విషయమై కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. పెంచిన ట్రాఫిక్‌ జరిమానాల విధింపుపై రాష్ట్రాలే సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చని స్పష్టంచేశారు. దీంతో జరిమానాల విధింపు రాష్ట్రప్రభుత్వాల నిర్ణయంపై వుండటంతో అన్ని రాష్ట్రాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయని సమాచారం.

దేశవ్యాప్తంగా పెరిగిన ట్రాఫిక్‌ జరిమానాలను గుజరాత్‌ ప్రభుత్వం మంగళవారం తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల సవరించిన మోటారు వాహనాల చట్టం-2019 ప్రకారం పెరిగిన ట్రాఫిక్‌ జరిమానాలను రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించుకొనే వెసులుబాటు ఉంటుందని వెల్లడించారు. 21వ శతాబ్దపు యువత (మిలీనియల్స్‌) ఎక్కువగా క్యాబ్ లపై ఆసక్తి కనబరుస్తుండడంతోనే కార్ల అమ్మకాలు తగ్గిపోయాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలపై  చేశారు.

దీనిపై సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలకు తావివ్వడంతో దీనిపైనా ఆయన వివరణ ఇచ్చారు. నిర్మల చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, వాహన అమ్మకాలు పడిపోయేందుకు ఇది కూడా ఒక కారణమని వివరించారు. బీఎస్‌-6 ప్రమాణాలతో హోండా యాక్టివా 125 స్కూటర్‌ ఆవిష్కరణ సందర్భంగా ఆయన దీనిపై స్పందించారు. ప్రతి నెలా దిగజారుతున్న వాహన అమ్మకాలకు పలు కారణాలు ఉన్నాయని అన్నారు.

విపణిలోకి ఈ-రిక్షాల అరంగేట్రంతో సంప్రదాయ ఇంధన వాహనాల అమ్మకాలు పడిపోవడం, దేశ వ్యాప్తంగా ప్రజా రవాణా మెరుగుపడడం వంటి కారణాల వల్ల వాహన రంగం కష్టాల్లో ఉందని వివరించారు.‘‘వాహనాలపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీని పది శాతం తగ్గించాలని, దీనివల్ల తమకు తాత్కాలిక ఊరట లభిస్తుందని ఆటోమొబైల్‌ రంగం కోరుతోంది. కానీ ఇది జీఎస్టీ మండలి పరిధిలోని అంశం. దీనిపై నేను ఆర్థికశాఖను సంప్రదించాను. ఇది వారి చేతుల్లోనే ఉంది’’ అని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles