Paatima's Rs 1 idlis a crowd-puller in Coimbatore హోటల్ బామ్మను ప్రశంసించిన ఆనంద్ మహీంద్రా

Paatima s rs 1 idlis a crowd puller in coimbatore

Kamalathal, Rs.1 idlis, Vadivelampalayam, Coimbatore, Paatima, Industralist, Anand Mahendra, selflessness

A 30-year-old eatery looks like any other nondescript building in a village. Home to octogenarian M. Kamalathal, in Vadivelampalayam on the outskirts of Coimbatore, visitors arrive here from near and far for her sought-after idlis — priced at Rs.1 each.

బామ్మ హోటల్లో రూపాయికే టిఫిన్.. ఆనంద్ మహీంద్రా ట్వీట్..

Posted: 09/11/2019 05:40 PM IST
Paatima s rs 1 idlis a crowd puller in coimbatore

అల్పాహారం చేయాలని ఏ హోటల్ కు వెళ్లినా.. కనీసం రూ.50 సమర్పించుకోవాల్సిందే. అలాంటిది రూపాయికే టిఫిన్ అందించాలంటే? ఇలాంటి అసాధ్యాన్ని తమిళనాడులోని ఓ బామ్మ సుసాధ్యం చేసి చూపిస్తోంది. కోయంబత్తూరులోని కమలాథల్(82) గత 30 ఏళ్లుగా ఓ చిన్న హోటల్ను నడుపుతోంది. ఈ హోటల్ కు ప్రతిరోజూ 3నుంచి ఐదు కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి టిఫిన్ అరగించే కస్టమర్లు వున్నరంటే ఆ హోటల్ ప్రత్యేకత ఏమైవుంటుంది.

రూపాయికే టిఫిన్ అంటే మాత్రం కస్టమర్లు వస్తారా.? అంతకన్నా మరింత ముఖ్యమైన రుచి, అమె చేసే పలహారం రుచులు, చట్నీల రుచి అక్కడివారికి భలే నచ్చేశాయి. రూపాయికి టిఫిన్ పెట్టడం అదీనూ రుచికరమంటే.. ఆ టిఫిన్ సెంటర్ వద్ద బారులు తీరే కస్టమర్లు వుండటం అతిశయోక్తి కాదు. ఈ 82 ఏళ్ల బామ్మ దినచర్య కూడా అలాంటిదే. ప్రతిరోజు ఉదయాన్నే 5 గంటలకు నిద్ర లేస్తుంది.

అనంతరం రోజుకు వెయ్యి ఇడ్నీలు, బోండాలు(మైసూర్ బజ్జీలు) తయారు చేస్తుంది. ఉదయం 6 గంటలకల్లా తన షాపును తెరుస్తుంది. ఆమె తయారుచేసిన ఇడ్లీ, సాంబార్, చట్నీ రుచి నోటిమాటగా వ్యాపించడంతో చుట్టుపక్కల 2-3 కిలోమీటర్ల నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ టిఫిన్ తినిపోతూ ఉంటారు. ఈ హోటల్ లో కమలాథల్ ఒక్కో ఇడ్లీని రూపాయికే అందిస్తోంది. దీంతో రూ.10 పెట్టగానే కస్టమర్ల కడుపు నిండిపోతోంది.

ఈ విషయమై కమలాథల్ మాట్లాడుతూ..‘గత 30 ఏళ్లుగా ఇదే పనిచేస్తున్నా. గతంలో ఒక్కో ఇడ్లీ, బోండాను 50 పైసలకే అందించేదాన్ని. అయితే సరుకుల ఖరీదు పెరగడంతో రూపాయికి అమ్ముతున్నా. అందరూ నా టిఫిన్ ను మెచ్చుకుంటారు’ అని సంతోషం వ్యక్తం చేసింది. ఎవరైనా డబ్బులు లేకుండా టిఫిన్ తిన్నా, పది రూపాయలకు తిని, రూ.5లే చేతిలో పెట్టినా ఈ బామ్మ వదిలేసిన సందర్భాలు చాలా ఉన్నాయట.

కోయంబత్తూరులో నిస్వార్థంగా సేవలు అందిస్తున్న బామ్మ కమలాథల్ పై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. 82 ఏళ్ల వయస్సులోనూ అమె ఎవరిపై ఆధారపడకుండా తన పని తాను చేసుకోవడంతో పాటు పది మందికి అల్పాహారం అందించాలన్న తపన అమెను నేటి అన్నపూర్ణగా మార్చివేసిందని, వందల మంది ఆకలిని తీర్చడం అభివర్ణించారాయన. 'ఇలాంటి కథనాలు ఆశ్చర్యం కలిగిస్తుంటాయని అన్నారు.

మనం జీవితంలో చేసే అన్నిపనులు కమలాథల్ చేస్తున్న సేవలో కొంత భాగానికి అయినా సరితూగుతాయా? అని అనిపిస్తోంది. కమలాథల్ ఇంకా కట్టెల పొయ్యినే వాడుతున్నట్లు నేను వీడియోలో గమనించా. ప్రజలెవరైనా ఆమె వివరాలు కనుక్కొని నాకు చెబితే కమలాథల్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టేందుకు, ఓ ఎల్పీజీ స్టవ్ ను కొనిచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నా’ అని ప్రకటించారు. దీంతో పలువురు నెటిజన్లు ఆమె వివరాలను ఆనంద్ మహీంద్రాకు ట్విట్టర్ లో పంపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kamalathal  Rs.1 idlis  Vadivelampalayam  Coimbatore  Paatima  Industralist  Anand Mahendra  selflessness  

Other Articles