'Low' intensifies, may grow to near-cyclone strength వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్షాలు..

Depression intensifies in bay of bengal rains may hit telugu states

Low Pressure Area, tropical storm podul, north bay of bengal, lopar, Telugu states rainfall, Rain in Telangana, Rain in Andhra Pradesh, Telangana, Andhra Pradesh, Politics

Scattered rain and thunderstorms are possible over Telugu States Telangana and Andhra Pradesh due to cyclonic circulation is present over bay of bengal.

వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్షాలు..

Posted: 09/03/2019 11:42 AM IST
Depression intensifies in bay of bengal rains may hit telugu states

బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారనుందని భారత్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. సముద్రంలోని ఉత్తర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయవ్య ప్రాంతంలో క్రమంగా బలపడుతోందని దీంతో రేపు ఉదయానికి ఇది వాయుగుండంగా మారుతుందని అంచనా వేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇదే సమయంలో అల్పపీడనానికి అనుబంధంగా సుమారు 7.6 కి. మీ ఎత్తులో నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని అన్నారు.

ముఖ్యంగా కోస్తా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా దక్షిణ కోస్తాంధ్ర, పరిసర ప్రాంతాల్లో సముద్ర మాట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. వీటి ఫలితంగా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు వున్నాయని అధికారులు తెలిపారు.

ఉపరితల ఆవర్తనం ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపు ప్రయాణం చేసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. అల్పపీడనం, నైరుతీ రుతుపవనాలు క్రియాశీలకంగా మారడం వల్ల ఏపీలోని 75 శాతం ప్రాంతాల్లో మూడు రోజులపాటు విస్తారంగా ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. కోస్తా ఆంధ్ర, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మధ్య కోస్తా, ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో 2 నుంచి 6 సెంటీమీటర్లు, మరికొన్ని ప్రాంతాల్లో 7 నుంచి 11 సెంటీమీటర్లు, ఒకటి రెండు చోట్ల 11 నుంచి 20 సెంటీమీటర్లు వరకూ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ వైకే రెడ్డి విడుదల చేసిన బులిటెన్ లో వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles