Pawan Kalyan sensational comments on Botsa అమరావతి రైతులకు పవన్ అండ..

Pawan kalyan says he is ready for agitation against change of ap capital

Janasena, Pawan Kalyan, Mangalagiri, farmers, Amaravati, capital issue, fan, handmade chappal, Trivikram Srinivas, trailer, Sye Raa Narasimha Reddy, Sye Raa, politics, Pawan Kalyan, Largo Winch, handmade chappal, birthday, Agnyaathavaasi, andhra pradesh, politics

Jana Sena party President Pawan Kalyan, who is touring in Andhra pradesh capital said he will be on farmers side in agitation on change of capital from amaravati and also made sensational statement on minister botsa satyanarayana.

అమరావతి రైతులకు పవన్ అండ.. బొత్సా వోక్స్ వ్యాగన్ వుంది జాగ్రత్తా.!

Posted: 08/31/2019 08:58 PM IST
Pawan kalyan says he is ready for agitation against change of ap capital

రాజధాని ప్రాంత రైతులకు అన్యాయం జరుగుతుంటే మాత్రం చూస్తూ ఊరుకోనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతి రైతులకు తాను అండగా నిలచిపోరాడుతానని అన్నారు. తనకు కేంద్రంలో పెద్ద నాయకులు తెలుసునని, అయితే వారిని ఇప్పటి వరకు ఉపయోగించుకోలేదని, కానీ రాజధానిపై ఇంకా రాష్ట్ర ప్రభుత్వం తరలింపు వ్యాక్యలు చేస్తే.. తాను వారిని కలసి అమరావతి రైతులకు లబ్ది చేకూర్చుతానని పవన్ కల్యాణ్ తెలిపారు. అమరావతి అనేది మన ఆత్మ గౌరవం అని నినదించారు. రాష్ట్రం కోసం, రాజధాని కోసం వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతులు తమ జీవితాలతో పాటు తమ వారసులు.. వారికి కలిగే వారసుల భవిష్యత్తును త్యాగం చేశారని పేర్కోన్నారు.

రైతులను ఇబ్బంది పెట్టే పని ఎవరు చేసినా.. రైతులకు మేం అండగా ఉంటామని ఆయన రైతులకు భరోసా కల్పించారు. మీరు ఓట్లు వేసినా వేయకపోయినా.. ఇది నా రాష్ట్రం, మీరు నా వాళ్లనే ఉద్దేశంతోనే పని చేస్తున్నాను. పులివెందులో రాజధాని పెట్టుకుంటాం, విజయనగరంలో రాజధాని పెట్టుకుంటామంటే కుదరదని జనసేనాని వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో రాజధాని ప్రాంత రైతులతో మాట్లాడారు. రాజధానిని మారిస్తే ఊరుకునేది లేదన్న ఆయన.. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏది కూలగొడదామనే తప్ప.. ఏది నిర్మిద్దామనే దిశగా ఆలోచించడం లేదన్నారు.

అధికార పార్టీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. గత ప్రభుత్వం తప్పు చేస్తే.. విచారణ చేయాలనే గానీ.. రాజధాని నిర్మాణాన్ని ఆపేస్తామంటే సరికాదన్నారు. కాలం గొప్పదనమో, ఈవీఎం గొప్పదనమో నాకు తెలీదు గానీ.. వైఎస్ఆర్సీపీకి 151 సీట్లొచ్చాయంటూ పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధానిని అమరావతి నుంచి ఎక్కడికీ వెళ్లదన్న పవన్.. రాబోయే తరాల భవిష్యత్తుతో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆడుకుంటున్నారని విమర్శించారు. రైతులు కౌలు కోసం భూములు ఇవ్వలేదు. రాజధాని కోసం త్యాగం చేశారు. రాజధాని నిర్మాణాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఆచితూచి మాట్లాడాలని జనసేనాని సూచించారు. కాలం ఎప్పుడూ ఒకరి వైపే ఉండదని, అధికారం ఎప్పుడూ ఒకరికే ఉండదన్నారు.

అమరావతిని రాజధానిగా కాదంటున్నారంటే.. మోదీని, అమిత్ షాను వ్యతిరేకిస్తున్నట్టే. ఆ ఫోక్స్ వ్యాగన్ కేసు ఏదో ఉన్నట్టుంది.. అని బొత్సను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పెద్దలతో నాకు పరిచయాలు ఉన్నా.. ఇప్పటి వరకూ వ్యక్తిగతంగా వాటిని వాడలేదు. రాజధానికి ఇబ్బంది కలుగుతుంటే మాత్రం.. మోదీని, అమిత్ షాను కలుస్తాను. జగన్ ఇదే ధోరణిలో ఉంటే కచ్చితంగా కేంద్ర పెద్దలను కలుస్తా. రైతులెవరూ భూములను అమ్ముకోవద్దని పవన్ సూచించారు. మంత్రి బొత్స సత్యనారాయణకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. రాజధాని విషయంలో జగన్ కుటుంబ సభ్యుల నుంచి కానీ, సన్నిహితుల నుంచి కానీ ఎలాంటి చెడు ప్రకటనలు రావడంలేదని అన్నారు.

ఈ నేపథ్యంలో బొత్స చెడు ప్రకటనలకు బాధ్యుడు కావొద్దని విజ్ఞప్తి చేస్తున్నా అంటూ హితవు పలికారు. బొత్స పెద్దరికం నిలబెట్టుకోవాలన్నారు. ‘‘బొత్స గారూ మీరు జగన్ రెడ్డి మాయలో పడొద్దు. విధ్వంసకర వార్తలను ప్రకటించొద్దు. జగన్ కుటుంబీకులెవరూ ఇలాంటి వార్తలను ప్రకటించరు. బొత్స ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. ఈ ప్రభుత్వంలోనూ ఆయన సీఎం కావొచ్చేమో. సీఎంగా పని చేయాలని ఆయనకు మనసులో ఎక్కడో ఉంది. అలాంటి వ్యక్తి ఇలా మాట్లాడటం తగదు’’ అని పవన్ కళ్యాణ్ హితబోధ చేశారు. ‘‘అవినీతి, అధికార దుర్వినియోగాన్ని మోదీ సహించరు. 2019లో ఏదో జరిగిపోయింది. మేం ఏం చేసినా చెల్లిపోతుందనుకుంటే.. వైఎస్ఆర్సీపీ మీద ఓ కన్నుందనే విషయం మర్చిపోవద్దు. బొత్సా గారూ జాగ్రత్త..’’ అని పవన్ తన ప్రసంగాన్ని ముగించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Janasena  Pawan Kalyan  Mangalagiri  farmers  Amaravati  capital issue  fan  handmade chappal  andhra pradesh  politics  

Other Articles