Rafale deal: Rahul Gandhi summoned by Mumbai court పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సమన్లు..

Rahul gandhi summoned by mumbai court over his commander in thief jibe at pm modi

rahul gandhi, rahul gandhi case, rahul gandhi summon, rahul gandhi news, rafale case, rafale scam, pm modi

A court in Mumbai has summoned Congress leader Rahul Gandhi in a defamation complaint against him for his “commander-in-thief” remark while attacking PM Modi last year over the Rafale fighter jet deal.

రాహుల్ గాంధీకి సమన్లు.. ప్రధానిపై చులకన వ్యాఖ్యలకు..

Posted: 08/31/2019 05:12 PM IST
Rahul gandhi summoned by mumbai court over his commander in thief jibe at pm modi

ప్రధాని నరేంద్రమోదీని 'కమాండర్‌ ఇన్‌ థీఫ్‌'గా సంబోధించిన కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీకి ముంబయిలోని గిర్గావ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు సమన్లు జారీ చేసింది. అక్టోబరు 3వ తేదీన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు రఫేల్‌ ఒప్పందంపై అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్‌ మధ్య మాట తూటాలు పేలిన విషయం తెలిసిందే. ఫ్రాన్స్‌తో జరిగిన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగిందన్నది కాంగ్రెస్‌ ప్రధాన ఆరోపణ. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ అంశాన్నే రాహుల్‌ ప్రచారాస్త్రంగా వినియోగించుకున్నారు.

పలు ఎన్నికల సభల్లో ‘చౌకీదార్‌ చోర్‌ హై’ అంటూ మోదీపై విమర్శలు కురిపించారు. అదే విధంగా గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ మోదీని 'కమాండర్‌ ఇన్‌ థీఫ్‌' గా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత మహేష్‌ శ్రీమాల్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాహుల్‌పై పరువునష్టం కేసు వేశారు. ‘ఆయన వ్యాఖ్యలు ఒక్క ప్రధానినే కాదు, భాజపా కార్యకర్తలందరినీ అవమానించినట్లు ఉన్నాయి. గతంలో కూడా రాహుల్‌ ‘కాపలాదారుడే దొంగ’ అని మోదీని పదేపదే విమర్శిస్తూ అగౌరవ పరిచారు’ అంటూ తన పిటిషన్‌లో కోర్టుకు తెలియజేశారు.

ముంబయిలోని గిర్గావ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి సమన్లు జారీ చేసింది. అయితే గత సంవత్సరం సెప్టెంబరులో పరోక్షంగా మోదీని ఉద్దేశిస్తూ 'కమాండర్‌ ఇన్‌ థీఫ్‌' అని సంబోధించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బిజెపి నేత మహేశ్‌ శ్రీమాల్‌ పరువు నష్టం దావా వేశారు. కేవలం ప్రధానినే కాకుండా బిజెపి కార్యకర్తలందరినీ రాహుల్‌ అ గౌరవపరిచారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే పలు సందర్భాల్లో 'కాపలాదారుడే దొంగ' అని మోదీని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యల్ని కూడా పిటిషనర్‌ ప్రస్తావించారు. కాగా ఈ నేపథ్యంలో దాఖలైన పరువు నష్టం దావా కేసులో ఆయనకు సమన్లు పంపారు. అక్టోబరు 3న వ్యక్తిగతంగా కోర్టులో హాజరుకావాలని ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles