Depression rains may hit Telugu States from Sept 2 తెలుగు రాష్ట్రాలకు చవితి నుంచి వర్షాలు..

Depression rains may hit telangana and andhra pradesh from sept 2

Low Pressure Area, tropical storm podul, north bay of bengal, lopar, Telugu states rainfall, Rain in Telangana, Rain in Andhra Pradesh, Telangana, Andhra Pradesh, Politics

The forecast predicts that the Low Pressure Area in north Bay of Bengal will further be developing into a depression by September 2-3, which will bring extensive rainfall in both Telugu States Telangana and Andhra Pradesh.

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్షాలు..

Posted: 08/31/2019 12:58 PM IST
Depression rains may hit telangana and andhra pradesh from sept 2

ఉష్ణ మండలీయ ప్రాంతంలో ప్రభావం చూపుతున్న పోడుల్ తుఫాను ప్రభావం తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలను తీసుకురానుంది. పోడుల్ తుఫాను ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశముంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా సహా దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముంది. కోస్తా తమిళనాడు పరిసరాల్లో సముద్రమట్టానికి 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ద్రోణి సెప్టెంబర్‌ 2 నాటికి అల్పపీడనంగా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

ఈ కారణంగా తెలంగాణ, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఒడిశా పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, దానికి అనుబంధంగా వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో నిన్న చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. ప్రస్తుతం ఇది బలహీనపడగా, తమిళనాడు కోస్తాలో ఏర్పడిన ద్రోణి బలపడుతోంది.

ఈ కారణంగా తెలంగాణ, కోస్తాంధ్ర, దీన్ని ఆనుకుని ఉన్న ఒడిశా, చత్తీస్‌గఢ్‌ ప్రాంతాల్లో ఈరోజు, రేపు, ఎల్లుండి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం వినాయక ఉత్సవాలకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో వర్షం కురిస్తే నిర్వాహకులకు కొంత నిరాశే అని చెప్పొచ్చు. కాగా, శుక్రవారం రోజంతా ఎండతీవ్రంగా ఉండగా, పగటి ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. సాయంత్రానికి అక్కడక్కడా చిరుజల్లులు పడ్డాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles