Flight makes emergency landing with Chiranjeevi on board చిరంజీవికి తప్పిన ప్రమాదం.. విమానం అత్యవసర ల్యాండింగ్..

Flight makes emergency landing chiranjeevi one among the passengers

Air Vistara, Chiranjeevi, Megastar Chiranjeevi, Sye Raa Narasimha Reddy, Sye raa promotion work, Vistara, Vistara Airlines, Technical glitch, Mumbai, Andrha Pradesh, Crime

The flight in which megastar Chiranjeevi travelling made an emergency landing after the Mupilot found a technical snag. It belongs to Vistara Airlines and took off from Mumbai Airport to Hyderabad. With technical glitch, the pilot made an emergency landing in Mumbai Airport.

చిరంజీవికి తప్పిన ప్రమాదం.. విమానం అత్యవసర ల్యాండింగ్..

Posted: 08/31/2019 12:05 PM IST
Flight makes emergency landing chiranjeevi one among the passengers

ప్రముఖ నటుడు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రయాణిస్తున్న విమానంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ముంబై నుంచి హైదరాబాద్ వచ్చేందుకు ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలెట్ వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంలో ప్రయాణికుంలందితో పాటు చిరంజీవి కూడా ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. టేకాఫ్ అయిన తరువాత అరగంట సమయానికి హైదరాబాద్ వెళ్లాల్సిన విమానం తిరిగి ముంబై విమానాశ్రయానికి చేరుకుని ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది.

ఈ సమయంలో మొత్తం 120 మంది ప్రయాణికులు విమానంలో వున్నారు. వారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. విమానంలో బిజినెస్ క్లాస్ లో కూర్చున్న చిరంజీవిని చూసిన ఓ ప్రయాణికుడు.. తన మోబైల్ ఫోన్ తో ఫోటోను తీసి దానిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. పైలట్ వెంటనే సమస్యను గుర్తించడంతో పెద్ద ప్రమాదమే తప్పిందంటున్నారు. ఎమర్జెన్సీగా ల్యాండ్ అవడంతో ప్రయాణీకులందరూ ఎయిర్ పోర్టులో పడిగాపులు కాశారు. మరో విమానం ఏర్పాటు చేసి..వారిని హైదరాబాద్‌కు పంపించారు.

చిరంజీవి కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా సినిమా తెరకెక్కుతోంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి నటించారు. కొణిదెల ప్రోడక్షన్స్ బ్యానర్‌లో హీరో రామ్ చరణ్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. నయనతార హీరోయిన్‌గా నటించింది. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు వంటి టాప్ స్టార్స్ నటిస్తుండడంతో సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. అక్టోబర్ 02న గాంధీ జయంతి సందర్భంగా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మళయాల భాషల్లో విడుదలవనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Air Vistara  Chiranjeevi  Megastar Chiranjeevi  Vistara  Mumbai  Andrha Pradesh  Crime  

Other Articles