SC dismisses Chidambaram anticipatory bail చిదంబరానికి మళ్లీ షాక్.. తీహార్ జైలుకు మాజీ కేంద్రమంత్రి..

Setback for p chidambaram top court says his petition infructuous

Chidambaram, p chidambaram, chidambaram sent to cbi custody, lookout notice, karti chidambaram, cbi court dismisses chidambaram petition, chidambaram sbi custody, p chidambaram inx media case, chidambaram inx media case, Supreme Court, INX Media Scam, kapil sibal, abhishek manu singvi, salman kurshid, politics

The Supreme Court has dismissed former Union minister P Chidambaram's appeal against the Delhi High court order, denying an anticipatory bail in the CBI case.

చిదంబరానికి మళ్లీ షాక్.. తీహార్ జైలుకు మాజీ కేంద్రమంత్రి..

Posted: 08/26/2019 12:59 PM IST
Setback for p chidambaram top court says his petition infructuous

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ న్యాయస్థానం విధించిన నాలుగు రోజుల కస్టడీ ఇవాళ్టితో పూర్తికానుండటంతో.. ఆయనకు బెయిల్ ఇవ్వాలని చిదంబరం తరపు న్యాయవాదులు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని అశ్రయించారు. కాగా, ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం పేర్కోంది. సీబిఐ అరెస్టు విషయంలో తలదూర్చలేమని సైతం సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. దీంతో చిదంబరాన్ని  జైలుకు తరిలించేందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి.

ఈ నెల 21వ తేదీ రాత్రి హై డ్రామా నడుమ చిదంబరాన్ని సీబిఐ అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపర్చారు. తమ విచారణలో భాగంగా అడుగుతున్న ప్రశ్నలకు చిదంబరం సమాధానాలు ఇవ్వడం లేదని, ఆయన తమకు సహకరించడం లేదని సీబీఐ న్యాయస్థానానికి తెలిపింది. దీంతో  న్యాయస్థానం సీబిఐ తరపు వాదనలను పరిగణలోకి తీసుకున్న  స్పెషల్ జడ్జి అజయ్ కుమార్ కుహార్‌ సీబిఐ వాదనలతో ఏకీభవించి చిదరంబరానికి నాలుగు రోజుల పాటు సిబిఐ కస్టడీకి అప్పగించారు. దీంతో ఇవాళ్టి వరకు ఆయన జుడీషియల్ కస్టడీలోనే వున్నారు.

చిదంబరం అరెస్ట్‌కు వ్యతిరేకంగా ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. చిదంబరంపై జరుగుతున్న విచారణ నిబంధనలకు విరుద్దంగా ఉందని మరో లాయర్ అభిషేక్ మనుసింఘ్వి వాదనాలు వినిపించారు. కానీ ఈ వాదనల్ని ధర్మాసనం తోసిపుచ్చింది. ముందుస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. అయితే చిదంబరాన్ని తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఇప్పటివకకు ఐదురోజుల పాటు సీబీఐ కస్టడీలో చిదంబరాన్ని అధికారులు విచారించారు. మరికొన్ని రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అధికారులు కూడా కోర్టును కోరారు. అయితే దీనిపై ఇంకా న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు.

ఇక వాటిపై నిర్ణయాన్ని న్యాయస్థానం తోసిపుచ్చిన పక్షంలో చిదంబరాన్ని తీహార్ జైలుకు తరలించనున్నారని సమాచారం. అక్కడ ఆయనను ఉంచేందుకు ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లు కూడా చేశారని తెలుస్తోంది. తీహార్ జైలులో చిదంబరంకు సెల్ నెం. 7 ను కేటాయించబోతున్నారు. ఇందులో ఆర్ధిక నేరగాళ్లు ఉంటారు. మిగతా ఖైదీలకు ఉండే సదుపాయాలు మాత్రమే చిదంబరంకు ఉంటాయని.. పప్పు .. 4 చపాతీలు చిన్న బౌల్ లో రైస్ ఇస్తామని తీహార్ జైలు అధికారులు చెబుతున్నారు. అతనికి సౌత్ ఇండియా ఫుడ్ కావాలంటే సెపరేట్ గా స్నాక్స్ అందుబాటులో ఉంచుతామని అది కూడా కోర్ట్ ఆర్డర్ ప్రకారమని చెబుతున్నారు. అలాగే జైల్లో చిదంబరానికి సీనియర్ సిటిజెన్స్ కు కల్పించే వసతుల్లో భాగంగా పరుపు లేకుండా ఉన్న మంచాన్ని ఇస్తామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : P Chidambaram  special CBI Court  INX Media Scam  cbi custody  kapil sibal  politics  

Other Articles