House Demolition Notice for Chandra Babu చంద్రబాబు ఇంటికి నోటీసులు...

House demolition notice for chandra babu

Chandra Babu Naidu, TDP, YSRCP, Chandra Babu news, Chandra Babu updates, Chandra Babu latest, Chandra Babu residence, notices for Chandra Babu, Chandra Babu residence notices

A demolishing notice has been pasted outside the house of Chandra Babu Naidu which has been constructed on the banks of Krishna river in Undavalli.

చంద్రబాబు ఇంటికి నోటీసులు...

Posted: 06/28/2019 12:59 PM IST
House demolition notice for chandra babu

కృష్ణానది కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇలాంటి నిర్మాణాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం జగన్‌ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ అక్రమంగా నిర్మించిందేనని నిర్ధారించిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) శుక్రవారం నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు నివాసం ఉంటోన్న భవనం యజమాని లింగమనేని రమేష్‌ పేరిట నోటీసులు జారీ చేశారు.చంద్రబాబు నివాసంతోపాటు 28 భవనాలకు నోటీసులు ఇచ్చారు. చట్టపరమైన అనుమతి పొందకుండా మొదటి అంతస్తు గదులు, భవన నిర్మాణం చేపట్టారని సీఆర్‌డీఏ సెక‌్షన్‌ 115(1)&115(2) కింద నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని, సంజాయిషీ సరిగ్గా లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇలాంటి నిర్మాణాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. అక్రమ కట్టడమైన ప్రజావేదికను ఆయన ఆదేశాల మేరకు ఇప్పటికే తొలగించారు.

 

 

 
 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandra Babu  TDP  YSRCP  

Other Articles