Two Separate Governors for Telugu States తెలుగు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లు!

Two separate governors for telugu states

Telugu states, Andhra Pradesh, Telangana, AP Governor, Telangana Governor, AP new Governor, Telangana new Governor

The Telugu states are expected to get two new Governors soon.

తెలుగు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లు!

Posted: 07/02/2019 03:54 PM IST
Two separate governors for telugu states

ఇరు తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు నుంచి గవర్నర్‌గా ఉన్న నరసింహన్‌, ఇరు తెలుగు రాష్ట్రాల బాధ్యతలను నిర్వహిస్తున్నారు. తాజాగా ఏపీ, తెలంగాణలకు వేర్వేరు గవర్నర్లను నియమించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఐదేళ్లు గడిచినా ఇప్పటి వరకూ ఉమ్మడి గవర్నర్‌నే కొనసాగిస్తున్నారు. అంధ్రప్రదేశ్, తెలంగాణకు గవర్నర్‌గా ఈఎస్ఎల్ నరసింహన్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుత గవర్నర్‌ నరసింహన్‌ 2009 నుంచి కొనసాగుతూ వస్తున్నారు. కాగా రెండు రాష్ట్రాలు పూర్తిగా వాటి భూభాగాల నుంచి పరిపాలన సాగిస్తుండటం, హైకోర్టు కూడా వేరుపడిన నేపథ్యంలో గవర్నర్లను  వేరుగా నియమిస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి కేంద్రం వచ్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుత గవర్నర్‌ పదేళ్లకు పైగా కొనసాగుతున్నారని, ఇంకా కొనసాగించడం బాగుండదన్న ఉద్దేశంతో హోంశాఖ ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుత గవర్నర్‌ దాదాపు పదేళ్లుగా కొనసాగుతున్నారని, ఆయనను ఇంకా కొనసాగించడం బాగుండదన్న ఉద్దేశంతో హోంశాఖ ఉన్నట్లు తెలుస్తోంది. నరసింహన్‌ను బదిలీ చేయడమో, జమ్మూ కశ్మీర్‌ వ్యవహారాల సలహాదారుగా నియమించడం జరుగుతుందని హోంశాఖ వర్గాలు వ్యాఖ్యానించాయి. అందులో భాగంగానే కొత్త గవర్నర్ల నియామకం జరగొచ్చని హోంశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telugu states  Andhra Pradesh  Telangana  

Other Articles