AP Police welcomes good news ఏపీ పోలీసులకు సీఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్..

Ap police heartfully welcomes good news from government

AP police, weekly off, Holiday, AP CM YS Jagan, AP government, Police Department, cops, Andhra Pradesh, crime

Andhra Pradesh Chief Minister YS JaganMohanReddy shares good news to the state Police department by issuing orders on weekly off, which is to be implimented from june 19.

ఏపీ పోలీసులకు సీఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్..

Posted: 06/18/2019 03:54 PM IST
Ap police heartfully welcomes good news from government

పోలీస్ అంటే ఎంతో పవర్ ఫుల్.. ఆ పవర్ రావడానికి వారి విధి నిర్వహణ కూడా ఒక కారణం. అయితే బ్రిటీషు కాలం నాడు రూపోందిన విధివిధానాలు, నియమనిబంధనలతో వారు ఇప్పటికీ డ్యూటీలు చేస్తున్నారు. ఈ క్రమంలో గత కొన్ని దశాబ్దాలుగా తమకు కూడా వారానికి ఒక్క రోజు వారాంతపు సెలవు ఇవ్వాలన్న డిమాండ్ ను తెరపైకి తీసుకువచ్చారు. ఇప్పటి వరకు ఈ డిమాండ్ ను విన్న ప్రభుత్వాలు వారి విన్నపాన్ని అటకెక్కించాయే తప్ప.. అమల్లోకి మాత్రం తీసుకురాలేదు. అయితే తన పాదయాత్ర సందర్భంగా కానిస్టేబుళ్ల సమస్యలను కూడా సానుకూలంగా విన్న వైఎస్ జగన్ వారికి హామిఇచ్చారు.

దీంతో ఏళ్లకు ఏళ్లుగా వున్న డిమాండ్ ఈ నెల 19 నుంచి అమల్లోకి రానుండటంతో వారిలో ఆనందం వెల్లివిరుస్తోంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత అన్ని వార్గాల ప్రజలను, రైతులను, ఉద్యోగులను, ఆకట్టుకుంటూ వెళ్తున్న క్రమంలో ఇక తాజాగా పోలీసుల వంతు వచ్చింది. పోలీసులకు కానిస్టేబుల్ మొదలుకుని సిఐ వరకు అందరికీ వారాంతపు సెలవు అమల్లోకి రానుంది. ఈ విధానం జూన్ 19వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానుంది. పోలీసుల డైరీలో వీక్లీ ఆఫ్ అనే పదమే ఎరుగరు.. కానీ ఇప్పుడు ఆ డైరీలో వారాంతపు సెలవు అన్న పదం జతకలవనుంది.

కేవలం వార్షిక సెలవులతో మాత్రమే సిక్ లీవ్, క్యాజువల్ లీవ్స్, ఎర్న్ లీవ్స్ ఉండేవి. కానీ జగన్ వారి జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకువచ్చారు. అధికారం చేపట్టిన వారం రోజుల్లోనే వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు. శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ నేతృత్వంలో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, 22మంది పోలీసు ప్రతినిధులతో కూడిన కమిటీని జూన్ 4న ఏర్పాటు చేశారు. వీక్లీ ఆఫ్‌ అమలు చేస్తే ఎదురయ్యే ఇబ్బందులను ఈ కమిటీ వారం రోజులపాటు అధ్యయనం చేసింది. జూన్ 10న మంగళగిరిలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో డీజీపీ సవాంగ్‌తో కమిటీ సమావేశమై వీక్లీ ఆఫ్‌ అమలుకు నిర్ణయించారు. ఇందుకు సిబ్బంది కొరత ఇబ్బంది కాదని కూడా తేల్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP police  weekly off  Holiday  AP CM YS Jagan  AP government  Police Department  cops  Andhra Pradesh  crime  

Other Articles