India's Population To Surpass China "Around 2027": UN జనభారతం కానున్న ఇండియా.. 2027కు టాప్ ప్లేస్..!

World population expected to reach 9 7 billion in 2050

World Population prospects, India crosses china population, Population of India, China, Latest population of India, india, China population, India population, United Nations, Global population, UN Report, politics

Around 2027, India is projected to overtake China as the world’s most populous country, a United Nations (UN) report released said.

జనభారతం కానున్న ఇండియా.. 2027కు టాప్ ప్లేస్..!

Posted: 06/18/2019 06:57 PM IST
World population expected to reach 9 7 billion in 2050

ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా ప్రస్తుతం చైనా కొనసాగుతున్నా.. త్వరలోనే ఆ దేశాన్ని వెనక్కు నెట్టి భారత్ జనభారతంగా అగ్రభాగన నిలుస్తుందని తాజాగా విడుదలైన ఓ నివేదిక స్పష్టం చేస్తోంది. వచ్చే ఎనిమిదేళ్లలో చైనా దేశ జనాభాను భారత్ మించి పోనుందని పేర్కొంది. అంతేకాదు రానున్న 30 ఏళ్లలో ప్రపంచ జనాభా 2 బిలియన్లు (2వందల కోట్లు) పెరుగనున్నట్టు ఐక్యరాజ్య సమితి నివేదిక తెలిపింది. ఈ రిపోర్టు ప్రకారం.. 2019, 2050 మధ్యకాలంలో ఇండియాలో దాదాపు 273 మిలియన్ల మంది జనాభా చేరనున్నట్టు పేర్కొంది.

ప్రస్తుత శతాబ్దం ముగిసేనాటికి అత్యంత జనాభా కలిగిన దేశంగా భారత్ మారునున్నట్టు నివేదికలో పేర్కొంది. నైజీరియాలో 200 మిలియన్ల జనాభా పెరుగుతుందని తెలిపింది. ఈ రెండు దేశాలు కలిపి 2050 నాటికి ప్రపంచ జనాభాలో మొత్తంగా 23 శాతం వరకు పెరుగుతుందని రిపోర్టు వెల్లడించింది. గత యూఎన్ అంచనా ప్రకారం.. ఇండియా 2022 నాటికి అతిపెద్ద జనాభా గల దేశమైన చైనాను మించిపోనుంది. రెండేళ్ల క్రితమే 2017 ప్రపంచ జనాభా రిపోర్టును యూఎన్ రిలీజ్ చేసింది.

ఇందులో భారత జనాభా 2024 నాటికి చైనా దేశాన్ని దాటేస్తుందని అంచనా వేసింది. 2019లో చైనా 1.43 బిలియన్ల మంది జనాభా ఉన్నారు. ఇండియాలో 1.37 బిలియన్ల మంది జనాభా ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత జనాభా గల ఈ రెండు దేశాలు 2019లో గ్లోబల్ జనాభాలో వరుసగా 19శాతం, 18 శాతం జనాభాతో యూనైటేడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాయి. ప్రపంచ జనాభా ప్రాస్పెక్ట్స్ 2019 యూఎన్ రిపోర్టు ప్రకారం.. వచ్చే 30ఏళ్లలో ప్రపంచ జనాభా 2 బిలియన్లకు పెరుగుతుందని అంచనా.

ప్రస్తుత జనాభా 7.7 బిలియన్ల నుంచి 2050 నాటికి 9.7 బిలియన్లకు జనాభా చేరనుంది. 2050 నాటికి ప్రపంచ జనాభాలో సగానికి పైగా పెరిగే దేశాల్లో 9 దేశాలపై అధ్యయనం జరిపింది. ఇందులో ముందు స్థానంలో ఇండియా ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో నైజీరియా, పాకిస్థాన్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో, ఇథోపియా, టాంజానియా, ఇండోనేషియా, ఈజిప్ట్, అమెరికా దేశాలు ఉన్నాయి. అంతేకాదు.. జీవన సాఫల్యత పెరగడం, సంతాన సాఫల్యత రేటు పడిపోవడంతో ప్రపంచ జనాభా గతంలో కంటే అధికంగా పెరిగిపోతుందని రిపోర్టు తెలిపింది.

చాలా దేశాల్లో జనాభా తగ్గేదిపోయి పరిమాణం పెరిగిపోతూ వస్తోంది. 2019లో 11మందిలో ఒకరు (9శాతంగా) ఉంటే 2050 నాటికి, ప్రపంచంలో ఆరుగురిలో ఒకరు 65ఏళ్ల వయస్సుతో 16శాతంగా పెరుగనున్నారు. 80ఏళ్ల వయస్సు ఉన్నవారు లేదా మూడింతలు పెరిగే అవకాశం ఉంది. 2019లో 143 మిలియన్ల మంది జనాభా 2050 నాటికి 426 మిలియన్లకు చేరనున్నట్టు రిపోర్టు వెల్లడించింది. పేద దేశాల్లోనే జనాభానే అత్యంత వేగంగా పెరుగుతోందని, దీంతో అదనంగా దేశం సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎదురువుతున్నాయని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  China population  India population  United Nations  Global population  UN Report  politics  

Other Articles