Mujra party busted on city outskirts ఠాణాకు అనుకుని ముజ్రా పార్టీ.. 18 బాడీబిల్డర్లు.. 2 జూనియర్ అర్టిస్టులు

Mujra party beside pahadi shareef police station busted

Mujra party, pahadi shareef, police station, hookah center, body builders, junior artists, Hyderabad police, Telangana, crime

Eighteen body builders were arrested and two junior artists were held when the Pahadishareef police raided a mujra party being held at a farmhouse beside the police station.

ఠాణాకు అనుకుని ముజ్రా పార్టీ.. 18 బాడీబిల్డర్లు.. 2 జూనియర్ అర్టిస్టులు

Posted: 04/27/2019 02:40 PM IST
Mujra party beside pahadi shareef police station busted

హైదరాబాదులో అర్థరాత్రి వేళ పార్టీలు నిర్వహించే సంస్కృతిని పారద్రోలేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపడుతున్నా.. యువత మాత్రం ఆ వైపుకే అధికంగా అకర్షితులవుతున్నారు. నగరాన్ని అనుకుని వున్న జిల్లా ఫామ్ హౌజ్ లపై నిరంతరం నిఘా పెట్టిన పోలీసులు అక్కడి ఎలాంటి పార్టీలు జరగకుండా చర్యలు తీసుకోవడంలో సఫలం చెందినా.. నగరంలోని పబ్ లు, నగర శివారు ప్రాంతాల్లోని ఫామ్ హౌజ్ లు, రిసార్టులలో ఏం జరుగుతుందన్న విషయాలపై నిఘా పెట్టలేకపోతున్నారు.,

ఈ క్రమంలో నగరంలోని పబ్ లపై పలు అంక్షలు విధించినా.. దొంగదారి, దొడ్డిదారుల్లో రేయింబవళ్లు అక్కడ మధ్యం అమ్మకాలు, డాన్సులు జరుగుతూనే వున్నాయి. పోలీసులు విధించిన నిబంధనలకు చెక్ పెడుతూ అర్థరాత్రి అయ్యిందంటే చాలు ఇక తమ రాజ్యమే.. తమదే ఇష్టారాజ్యం అన్న తీరులో పబ్ యాజమాన్యాలు ప్రవర్తిస్తున్నాయి. ఈ విషయాన్ని పక్కన బెడితే.. నగర శివారల్లోని ఫామ్ హౌజుల్లో కూడా ఇలాంటి తంతులు జరుగుతూనే వున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరశివార్లలోని ఓ ఫామ్ హౌజ్ లో మరో ముజ్రా పార్టీజరిగింది.

పహడిషరీఫ్ పరిధిలో ఈ పార్టీ జరిగింది. అయితే, పోలీస్ స్టేషన్ కు సమీపంలో ఉన్న ఫాంహౌస్ లో ఈ పార్టీ జరగడం గమనార్హం. నదీం అహ్మద్ అనే యువకుడి పుట్టినరోజు సందర్భంగా ఈ పార్టీ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వారిపై దాడి చేశారు. గంజాయి, హుక్కా, మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అమ్మాయిలతో పాటు 18 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన యువతులు ఇద్దరు జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఉన్నట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles