RBI to issue new Rs 20 note ఆర్బీఐ నుంచి కొత్త రూ.20 నోటు.. పాతవి కూడా చెల్లుబాటు..

Rbi to soon issue new greenish yellow coloured rs 20 note

new 20 rupee note, 20 rs new note, new 20 rupees note, 20 rupees new note, new 20 rupee note image, new 20 rupee note color, new 20 rupee note in india, new 20 rupee note 2019, new note in india. new Rs 20 note, Reserve Bank of India, RBI Governor, Shakti Kanth Das, New Rupee Note, rs 20 green note

The Reserve Bank of India (RBI) said that it would soon issue new Rs 20 notes in ‘greenish yellow’ colour. The banknote in the Mahatma Gandhi (New) series will have a motif of Ellora Caves on the reverse, depicting the country’s cultural heritage.

భారతీయ రిజర్వు బ్యాంకు నుంచి మరో కొత్త రూ.20 నోటు..

Posted: 04/27/2019 03:14 PM IST
Rbi to soon issue new greenish yellow coloured rs 20 note

భారతీయ రిజర్వు బ్యాంకు మరో కొత్త నోటును మార్కెట్ లోకి త్వరలో విడుదల చేయనుంది. అదే కొత్త ఇరవై రూపాయల నోటు. పది రూపాయల నోటు, యాభై రూపాయల నోటు. వంద, రెండువందల నోట్లను కూడా కొత్త రూపొందించి భారతీయ అర్థిక వ్యవస్థలోకి తీసుకువచ్చిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా రూ.20 నోటును కూడా విడుదల చేయనుంది. ఈ మేరకు రిజర్వు బ్యాంకు ప్రకటనను వెలువరించింది. మహాత్మా గాంధీ సిరీస్ లో ఈ నోటు ఉంటుందని ఆర్బీఐ పేర్కోంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకంతో ఈ నోటు వెలువడనున్నట్టు తెలిపింది.

ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగుల మిశ్రమంగా ఈ కొత్త నోటు ఉన్నట్టు సమాచారం. కొత్త రూ.20 నోటుతో పాటు పాత నోట్లు కూడా చెల్లుతాయని, దీనిపై ఎటువంటి అనుమానాలు అవసరం లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీంతో వంద రూపాయల మార్పిడికి అధికంగా వినియోగపడుతున్న రూపాయలు యాభై నోటు, పది నోట్లకు అదనంగా కొత్త 20 రూపాయల నోటు దోహదపడనుంది.

కొత్త 20 రూపాయల నోటు ప్రత్యేకతలు..
    
* నోటు సైజు 63 మి.మీ x 129 మి.మీ.
* నోటు ఒక వైపున్న సీత్రూ ప్రాంతంలో 20 సంఖ్య కనిపిస్తుంది. దేవనాగలి లిపిలో కూడా ఈ నంబర్ ఉంటుంది.  
* నోటుకు ఒక వైపు మధ్యలో మహాత్మాగాంధీ బొమ్మ ఉంటుంది. ఆర్బీఐ, భారత్, ఇండియా, 20 కనిపిస్తాయి.
*  గాంధీకి కుడివైపున ప్రామిస్ క్లాజ్, ఆర్బీఐ గవర్నర్ సంతకం, ఆర్బీఐ చిహ్నం ఉంటాయి.
* గాంధీ బొమ్మకు మరోవైపున అశోక స్తంభం, 20 సంఖ్య వాటర్ మార్క్ లు ఉంటాయి.
* నోటుకు మరోవైపున ఎడమపక్కన నోటును ప్రింట్ చేసిన సంవత్సరం ఉంటుంది.
*  స్వచ్ఛభారత్ నినాదంతో పాటు లోగో ఉంటుంది.
* అధికారిక గుర్తింపు కలిగిన భాషల్లో నోటు విలువ రాసి ఉంటుంది.
* ఎల్లోరా గుహల చిత్రం ముద్రించి ఉంటుంది.
* ఈ నోట్లు ఆకుపచ్చ, పసుపు మిశ్రమ రంగుతో ముద్రించి ఉంటాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles