ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలపై సీపీఐ నేత రామకృష్ణ సంచలన వ్యాక్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో డబ్బున్న పార్టీలు మాత్రమే రాజకీయం చేసేలా తయారైందని, సంపన్నులు మాత్రమే చట్టసభలకు ఎన్నికలయ్యేలా ఇక్కడి రాజకీయ పార్టీలు పరిస్థితులను మార్చేస్తున్నాయని ఆయన అరోపించారు. ఇంత దారుణంగా పరిస్థితులు మారినా.. ఎన్నికల సంఘానికి మాత్రం ఏమీ కనిపించదు.. వినిపించదు అన్నట్లుగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ధన ప్రవాహం ఎంతపెద్దస్థాయిలో వుందో సామాన్యులకు కూడా కనిపించిందని, కానీ ఈసీకి మాత్రమే కనిపించలేదని అన్నారు.
సార్వత్రిక ఎన్నికలతో పాటు వచ్చిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో రాజకీయ పార్టీలు నగదు వరదను పారించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు తమ మిత్రపక్షం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను భీమవరంలో ఓడించడానికి రాజకీయ పార్టీలు భారీ కుట్రకు తెరలేపాయనీ ఆయన సంచలన అరోపణలు చేశారు. పవన్ కల్యాణ్ కు ఓటేస్తే ఏం లాభం.. అదే మాకు వేస్తే ఒక్కో ఓటుకు రూ.3,000 వేలు ఇస్తామని మరీ పోటీపడి పార్టీలు డబ్బును ఇబ్బడిముబ్బడిగా ఖర్చు పెట్టాయని ఆరోపించారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు.
ఆంద్రప్రదేశ్ ఆపధర్మ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సమీక్షలు చేయకూడదని మాట్లాడుతున్న ఈసీ.. ఎన్నికల్లో ధన ప్రవాహం ఈసీకి కనిపించలేదా? అని రామకృష్ణ ప్రశ్నించారు. మరి ఎన్నికలలో ఇంత పెద్దఎత్తున్న ధన ప్రభావం వున్నా ఎన్నికలను ఎందుకు రద్దు చేయలేదో చెప్పాలని ఆయన నిలదీశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైసీపీ అధినేత జగన్ కు రూ.600 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. పోలీసుల తనిఖీల్లో డబ్బులు దొరికిన ప్రతీ నియోజకవర్గంలో మళ్లీ ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.
మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. ఏపీలో ఎన్నికల నిర్వహణలో ఈసీ పూర్తిగా విఫలమయిందనీ, ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తామని తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్ లోని చాలా గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని తెలిపారు. నీటి సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 25న రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లలో మెమొరాండం ఇస్తామని అన్నారు. ప్రజాసమస్యలపై చిత్తశుద్దితో పోరాడే రాజకీయ పార్టీలను గెలుపుకు దూరంగా ఉంచాలనే కుట్ర ఆంధ్రప్రదేశ్ లో జరుగుతోందని రామకృష్ణ అందోళన వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
May 17 | షరియా చట్టం అమలుజరిగే ఇస్తామిక్ దేశాల్లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో.. అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఇరాక్, ఇరాన్, సౌదీ అరేబియా వంటి దేశాల్లో అమలుపర్చే బహిరంగ శిక్షలు పలు సామాజిక మాద్యమాల్లోనూ... Read more
May 17 | కంటికి కనిపించని శత్రువుతో యుద్దం చేస్తున్నామన్న భయాందోళన మధ్య కరోనా తొలి దశలో దేశప్రజలందరూ అప్రమత్తతో వ్యవహరించారు. అయినా భారీగానే కేసులు నమోదయ్యాయి. ఇక మరణాలు కూడా నమోదు కావడంతో దేశప్రజల్లో మరింత అందోళన... Read more
May 17 | ఓ వైపు మహారాష్ట్రలో బీజేపి అధికార ప్రతినిధి వినయక్ అంబేకర్ పై దాడి చేసిన నేపథ్యంలో దిగ్గుబాటు చర్యలకు దిగిన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీపై మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ కూడా సంచలన అరోపణలు చేసింది.... Read more
May 16 | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ ను టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేసిన బీజేపీ రాష్ట్రస్థాయి నేతపై దాడి చేసిన నేపథ్యంలో ఆ పార్టీ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగింది.... Read more
May 16 | ఆయనో ప్రోఫెసర్.. ఎదిగిన విద్యార్థులకు ఉన్నతమైన వ్యక్తులుగా.. ప్రోఫెషనల్ కోర్సులను బోధించే గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగుతున్నాడు. అయితే ఆయన చేసిన పనే ఇప్పుడాయనను వార్తల్లో నిలిపింది. తాను ప్రోఫెసర్ అన్న విషయాన్ని మర్చిన ఆయన..... Read more