actress poonam kaur panic on students sucide విద్యార్థుల ఆత్మహత్యలపై నటి అవేదన..

Security beefedup at inter board actress poonam kaur panic on students sucide

students union protest inter board, students arrest intermIediate board, security intermiediate board, parents agitation intermiediate board, three level security at inter board, poonam kaur panic on students sucides, actress poonam kaur, Telangana CM, KCR, Intermiediate results, KTR, interboard failure, Telangana, politics

Security beefed up at Intermediate Board in Nampally where the student unions and aggrieved parents staging dharna in a large number day to day, over results goof up. MeanWhile actress poonam kaur had been panic over students suicide deaths.

ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత.. విద్యార్థుల ఆత్మహత్యలపై నటి అవేదన..

Posted: 04/23/2019 12:51 PM IST
Security beefedup at inter board actress poonam kaur panic on students sucide

తెలంగాణలో ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల నిర్లక్షం విద్యార్థులు బంగారు భవిత పట్ల శాపంగా మారడంతో గత కొన్నాళ్లుగా కనిపించని విద్యార్థుల ఆత్మహత్యలు మళ్లీ తెరపైకి రావడం.. ఏకంగా 17 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంపై పలువురు  ప్రముఖులు విద్యార్థుల భవిష్యత్తు పట్ల భరోసా కల్పిస్తూ వారికి ధైర్యాన్ని అందిస్తున్నారు. తాజాగా సినీ నటి పూనమ్ కౌర్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ తీవ్ర అవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ‘తెలంగాణ ఇంటర్ విద్యార్థులు ఇలాంటి తీవ్రమైన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదు.

ఓ ఇంటర్ విద్యార్థి బిల్డింగ్ పైన నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. మెరిట్ విద్యార్థి అయినప్పటికీ పరీక్షల్లో ఓ మార్కుతో ఫెయిల్ కావడంతో అతను ఈ  నిర్ణయం తీసుకున్నాడని తనకు తెలిసిందని.. తన బంగారు జీవితాన్ని ఒక్క మార్కు మార్చేస్తుందా.? లేక తాను తీసుకున్న విపరీత నిర్ణయం మార్చేస్తుందా.? అని అమె అవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు ఉస్మానియా విశ్వవిద్యాలయం దగ్గర ఇలాంటి ఘటనే జరిగింది. ఇంటర్ విద్యార్థుల భద్రతపై ఆందోళన చెందుతున్నా’ అని పూనమ్ కౌర్ ట్విట్టర్ లో స్పందించారు.

ఇంటర్ బోర్డు వద్ద మూడంచెల భద్రత

తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకం కారణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ పిల్లలకు న్యాయం చేయాలంటూ భారీగా తల్లిదండ్రులు హైదరాబాద్ లోని బోర్డు కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతలు అదుపు తప్పకుండా ఇద్దరు డీఎస్పీల నేతృత్వంలో మూడంచెల భద్రత ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులను పోలీసులు బెదిరిస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోండి. ‘లేదంటే మీ అందరిని అరెస్ట్ చేస్తాం’ అని హెచ్చరిస్తున్నారు.

దీంతో తమ పిల్లలకు న్యాయం ఎవరు చేస్తారని తల్లిదండ్రులు పోలీసులను ఎదురు ప్రశ్నిస్తున్నారు. అనుభవం లేని ఏజెన్సీకి పరీక్షల బాధ్యతలు అప్పగించి తమ పిల్లలను ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకూ న్యాయమని నిలదీస్తున్నారు. ఈ విషయమై కొందరు విద్యార్థులు మాట్లాడుతూ.. తాము రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నించినా ఇంటర్ బోర్డు వెబ్ సైట్ పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles