janasena sympathiser over-action పవన్ అభిమాని అత్యుత్సాహం.. జనసేనాని అస్వస్థత

Janasena chief pawan kalyan fall ill due to busy shedule

pawan kalyan, janasena, Pawan Kalyan vizianagaram, Pawan Kalyan sun stroke, busy election campaign, vijayawada, gannavaram, pawan kalyan hospital, andhra pradesh, politics

Jana Sena Party president Pawan Kalyan suffered illness due to sun stroke and visited a corporate hospital in Vijayawada for medical tests. He participated in election campaign in Vizianagaram today, where a party fan came and touched his feet.

నిర్విరామ ప్రచారంతో అస్వస్థతకు గురైన పవన్ కల్యాణ్..

Posted: 04/05/2019 07:33 PM IST
Janasena chief pawan kalyan fall ill due to busy shedule

జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ విజయనగరం జిల్లాలో తీవ్రమైన ఎండ ఉన్న సమయంలో పవన్‌ అక్కడ ప్రచారం చేయడంతో ఆయనకు వడదెబ్బ తగిలింది. విజయనగరం పర్యటన ముగించుకుని విజయవాడకు చేరుకున్న పవన్‌ అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. విశ్రాంతి తీసుకోవాలని పవన్‌కు వైద్యులు సూచించారు.

గత కొన్ని రోజులుగా విశ్రాంతి లేకుండా రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆయన డీహైడ్రేషన్‌కు గురైనట్టు వైద్యులు తెలిపారు. దీంతో గుంటూరు జిల్లా తెనాలి, సత్తెనపల్లిలో రోడ్‌షో, బహిరంగ సభలు రద్దుచేసినట్టు పార్టీ నేతలు వెల్లడించారు. శనివారం నుంచి ఆయన ప్రచారానికి సిద్ధమవుతారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. దీనికితోడు ఒక్కోసారి అభిమానుల అత్యుత్సాహం కూడా నాయకులను ఇబ్బందులకు గురిచేస్తుంది.

తాజాగా, పవన్ కల్యాణ్ కు అలాంటి పరిస్థితే ఎదురైంది. విజయనగరంలో నిర్విరామ ప్రచారంతో ఒకవైపు అరోగ్యం సహకరించకున్నా.. ఆయన అక్కడి సభకు హాజరై ప్రసంగించారు. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన ఓ అభిమాని దూకుడు ప్రదర్శించి ఓ నా దేవుడా అంటూ పవన్ కల్యాణ్ కాళ్లపై పడ్డాడు. అది చూసిన సెక్యూరిటీ అతడ్ని వెనక్కు లాగేందుకు యత్నించగా అభిమాని పవన్ కాళ్లను గట్టిగా పట్టుకున్నాడు. ఈ క్రమంలో బ్యాలెన్స్ తప్పిన పవన్ కిందపడ్డారు. వెంటనే తేరుకుని తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  sun storke  vijayawada  vizianagaram  mayawati  andhra pradesh  politics  

Other Articles