election officials seize Rs 5Cr from RTC bus శ్రీకాకుళం ఆర్టీసీ బస్సులో డబ్జే డబ్బు..

Election officials seize rs 5cr from rtc bus in srikakulam

ycp leader son in bus, ycp money sieze, srikakulam Rajam, cash seize in RTC bus, YSR Congress, Andhra Pradesh, politics

Andhra Pradesh: Srikakulam police seized 3 bags stuffed with currency notes which amounted to be Rs 5 Crores 7 Lakhs and more cash, in State Road Transport Corporation bus at Jendala Dibba in Rajam today

శ్రీకాకుళం ఆర్టీసీ బస్సులో డబ్జే డబ్బు..

Posted: 04/05/2019 06:43 PM IST
Election officials seize rs 5cr from rtc bus in srikakulam

సార్వత్రిక ఎన్నికల వేళ అటు తెలంగాణాలో కోటాను కోట్ల రూపాయల డబ్బు పట్టుపడుతోంది. ఎన్నికల వేళ అభ్యర్థులు డబ్బును తమ నియోజకవర్గాలకు రవాణా చేసుకునేందుకు అనేక మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. మురళీ మెహన్ కు చెందిన జయభేరి సంస్థ ఉద్యోగుల రెండు బ్యాగుల్లో ఏకంగా రూ. రెండు కోట్లను తీసుకుని ఎంఎంటీఎస్ రైలులో సికింద్రబాద్, అటు నుంచి మురళీమోహన్ ఇంటికి చేరవేసే క్రమంలో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులకు చిక్కి ఊచలు లుక్కబెడుతున్నారు.

ఇక ఇదే సమయంలో ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా నల్లడబ్బుల కట్టలు అక్రమంగా తరలివెళ్తున్నాయి. ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన ఎక్స్ ప్రెస్ బస్సులో ఏకంగా ఐదు కోట్ల రూపాయలను తరలించారు అగంతకులు. అర్టీసీ బస్సులోని డీజిల్ ట్యాంకు పక్కన ప్రయాణికుల లగేజీ నిల్వ చేసే చోట మూడు బ్యాగులను ఉంచారు. కాగా, జిల్లాలోని రాజాం మండలం బొద్దాం వద్ద ఈ బస్సును అపి తనిఖీలు చేసిన పోలీసులు మూడు బ్యాగుల్లో పెద్దఎత్తున తరలిస్తున్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ బస్సు శ్రీకాకుళం నుంచి పాలకొండకు వెళుతుండగా సరిగ్గా జెండా బోమ్మలదిబ్బ వద్ద ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ డబ్బు తమదని ఏ ఒక్కరు కూడా అంగీకరించకపోవడంతో.. బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులను అధికారులు రాజాం పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. కాగా, ఇదే బస్సులో పాలకొండకు చెందిన వైసీపీ నేత తనయుడు విక్రాంత్ ఉండటంతో ఆయన్ను కూడా పోలీసులు విచారిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles