full josh in Anantapur TDP as two groups join hands ‘పురం’లో టీడీపీకి ‘అనంత’ బలం.. కార్యకర్తల్లో జోష్..

Full josh in anantapur tdp as two groups join hands

andhra pradesh CM Chandrababu, TDP president chandrababu, JC Diwakar Reddy, Prabhakar Chowdary, Chandrababu, JC Pawan Reddy, TDP, YS Jagan, YSRCP, Anantapur, TDP activists, andhra pradesh, politics

Full josh in Anantapur TDP activists as JC Diwarkar reddy and Prabhakar chowdary groups join hands and busy campaigning for elections.

‘పురం’లో టీడీపీకి ‘అనంత’ బలం.. కార్యకర్తల్లో జోష్..

Posted: 04/05/2019 05:52 PM IST
Full josh in anantapur tdp as two groups join hands

అనంతపురం టీడీపీ పార్టీ కార్యకర్తలు కొత్త ఉత్తేజంతో ప్రచారపర్వం నిర్వహిస్తున్నారు. ఇన్నాళ్లు ఉప్పునిప్పులా వుండే రెండు వర్గాల నేతలు ఎవరి ప్రచారాన్ని వారు వేర్వేరుగా నిర్వహించుకోవడంతో.. విస్తుపోయిన కార్యకర్తలు.. ప్రచారం చేస్తున్నా ఎక్కడో ఎదో వెలితి మాత్రం కనిపించేది. దీంతో వర్గాలుగా చీలిపోయి ఎడముఖం పెడముఖంగానే అనంతపురం టీడీపీ కార్యకర్తలు ప్రచారపర్వం చేపట్టారు. అలాంటి రెండు వర్గాలకు చెందిన నేతలు చేతులు కలపడంతో.. టీడీపీ కార్యకర్తల్లో నూతనోత్తేజం కనిపిస్తోంది.

 అనంతపురంలో పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి, అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుందేనన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రభాకర్ చౌదరికి టికెట్ కేటాయింపు విషయంలోనూ జేసీ దివాకర్ రెడ్డి ఏకంగా అధినేత చంద్రబాబుపై తీవ్రస్వరంతో వ్యవహరించారు. చంద్రబాబు తన ముఖం చూసి టీడీపీకి ప్రజలు ఓట్లు వేస్తారని భావిస్తున్నారని కూడా వ్యాఖ్యానించారు. దీంతో ఈ రెండు వర్గాల మధ్య అంతరం మరింతగా పెరిగింది.

ఈ నేపథ్యంలో ప్రభాకర్ చౌదరి, జేసీ కుమారుడు పవన్ కుమార్ రెడ్డి (టీడీపీ ఎంపీ అభ్యర్థి) లు మొన్నటి వరకు ఎవరికి వారే ప్రచారం చేసుకున్నారు. కాగా, ఇటీవల అనంతపురం వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు... ఇద్దరు నేతలను పిలిచి... కలసి ముందుకు సాగాలని సూచించారు. దీంతో, ప్రత్యర్థులిద్దరూ ఒకటయ్యారు. దీంతో, తెలుగు తమ్ముళ్లలో, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  JC Diwakar Reddy  Prabhakar Chowdary  JC Pawan Reddy  TDP  Anantapur  andhra pradesh  politics  

Other Articles