SPY Reddy suddenly fall ill, admitted జనసేన నంద్యాల ఎంపీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డికి అస్వస్థత..

Janasena nandyal mp candidate spy reddy health condition critical

pawan kalyan, janasena, Pawan Kalyan SPY Reddy, Pawan Kalyan SPY Reddy nandyal, SPY Reddy JanaSena, SPY Reddy nandyal, SPY Reddy, nandyal parliamentary constituency, andhra pradesh, politics

This is big shock to Janasena party as the noted politician and industralist SPY Reddy, the Nandyal lok sabha candidate from Janasena party, health condition had suddenly been critical, his family members rushed him to hospital.

జనసేన నంద్యాల ఎంపీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డికి అస్వస్థత..

Posted: 04/04/2019 03:32 PM IST
Janasena nandyal mp candidate spy reddy health condition critical

నంద్యాల జనసేన అభ్యర్థి, సిటింగ్‌ ఎంపీ ఎస్పీవై రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న తన పార్లమెంటు నియోజకవర్గంలో ముమ్మరంగా తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌ తరలించారు. అక్కడి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

గత ఎన్నికల్లో నంద్యాల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన ఎస్పీవై రెడ్డి ప్రమాణ స్వీకారం చేయకముందే టీడీపీ పార్టీలోకి ఫిరాయించారు. అప్పటి నుంచి ఆ పార్టీలో కొనసాగిన ఆయన తాజా ఎన్నికల్లో మళ్లీ నంద్యాల టికెట్టు ఆశించారు. అయితే తెలుగుదేశం పార్టీ మొండిచెయ్యి చూపడంతో ఆయన స్వతంత్రంగా బరిలోకి దిగి సత్తా చాటుతానని చెప్పారు.

ఈ క్రమంలో జనసేన పార్టీ నేతలు ఆయనను పార్టీలోకి అహ్వానించడంతో ఆయన పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. అయితే ఎస్పీవై రెడ్డి కుటుంబానికి చెందిన వ్యక్తులకు ఏకంగా నాలుగు టికెట్లను జనసేన కేటాయింది. ఈ మేరకు షరతును విధించిన తరువాతే ఆయన పార్టీలో చేరడంతో.. ఆయన షరతును జనసేన కూడా పూర్తి చేయాల్సి వచ్చింది. దీంతో ప్రస్తుతం నంద్యాల నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఓట్లు చీలుతాయన్న ఉద్దేశంతో ఎస్పీవై రెడ్డిని చంద్రబాబు బుజ్జగించే ప్రయత్నం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  SPY Reddy  nandyal lok sabha  andhra pradesh  politics  

Other Articles