తనను యాక్టర్ అంటూ విమర్శిస్తున్న వైసీపీ అధినేత జగన్ పై జనసేనాని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. వైసీపీలో యాక్టర్లు లేరా? అని విమర్శించారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అంటే జగన్ కు భయమని చెప్పారు. ఆయన అధికారంలోకి వస్తే అవే కేసులు రాష్ట్ర అభివృద్దికి అటంకాలుగా మారుతాయని పవన్ అన్నారు. ఓటర్లు విజ్ఞతతో మార్పు కోసం వచ్చిన జనసేన పార్టీకి.. అవినీతి. అక్రమాల కేసులు లేని క్లీన్ ఇమేజ్ వున్న తమ అభ్యర్థులకు ఓట్లు వేయాలని ఆయన కోరారు.
పలు కేసుల్లో ఏ2గా ఉన్న వ్యక్తిని వెంటపెట్టుకుని జగన్ ఎందుకు తిరుగుతున్నారని పవన్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. టీడీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారంటూ విమర్శిస్తున్న వైసీపీ నేతలు... అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదని అన్నారు. వీళ్లుకు అధికారం కోసం ఓక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థించడం చూస్తూ టీడీపీ నేతలు చేసిన అక్రమాలను వీళ్లు కూడా చేయాలన్న తలంపుతో వున్నారని ఆయన దుయ్యబట్టారు. దళితులపై జగన్ కు ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలంటే... పులివెందులకు వెళ్లాలని సూచించారు. విశాఖలోని అక్కయ్యపాలెంలో ప్రచారం సందర్భంగా పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ ఎన్నికల్లో జనసేన లోక్ సభ అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణ, విశాఖ ఉత్తరం అభ్యర్థి పసుపులేటి ఉషాకిరణ్ లు భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ, వైసీపీ నేతలు మతగ్రంథాలపై, భగవంతుడి ఆలయాలపై ఒట్లు వేయించుకుని డబ్బులు ఇస్తున్నారని విమర్శించారు. అక్రమ పద్ధతుల్లోనే ఈ డబ్బును సంపాదించారని అన్నారు. ఈ డబ్బులు పంచడం ద్వారా వైసీపీ, టీడీపీ నేతలు పాపాలను కడుక్కుంటున్నారని వ్యాఖ్యానించారు.
పవన్ కల్యాణ్ అంటే ఓ వ్యక్తి కాదనీ, ఓ వ్యవస్థ అని ఆయన తెలిపారు. విశాఖ ఉత్తరం ప్రాంతంలో తీవ్రమైన కాలుష్యం ఉందనీ, కానీ దీని గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్యాన్ని నియంత్రించాలన్న సంకల్పం జనసేన పార్టీకి ఉందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఎలాగూ గెలవదని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు హరిబాబు, విష్ణుకుమార్ రాజులు కనిపిస్తే తన తరఫున నమస్కారం చెప్పాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుకు ఇంకో పదేళ్లయినా ప్రజలు క్షమించరన్నారు. భూములు కబ్జాలు చేసే వ్యక్తులను జైల్లో పెట్టిస్తామని పవన్ హెచ్చరించారు. వైసీపీ నేతలు విశాఖలో గెలిస్తే గూండాయిజం, రౌడీయిజం చేస్తారనీ, భూకబ్జాలకు పాల్పడుతారని పవన్ ఆరోపించారు. గత ఎన్నికల్లో టీడీపీ నేతలను గెలిపిస్తే వాళ్లు ఇప్పటికే ఈ కబ్జాలను చేతల్లో చేసి చూపారని దుయ్యబట్టారు. గంటా శ్రీనివాసరావు వంటి వ్యక్తులు భూములను కబ్జా చేసేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గాజువాక మినీ భారత్.. విశాఖ తల్లిలాంటిది: పవన్
వివిధ మతాలు, కులాలు, ప్రాంతాల వారితో నిండివున్న గాజువాక ప్రాంతం మినీ భారతదేశంలాంటిదని, తల్లిలాంటి ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి కారణం ఇదేనని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. గురువారం ఆయన గాజువాకలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నన్ను మీ కుటుంబ సభ్యుడిగా భావించి ఆశీర్వదించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
సగటు మనిషి బతికే ప్రాంతం గాజువాక అని, అందుకే ఈ ప్రాంతమంటే ఇష్టమని చెప్పారు. ఇన్ని పరిశ్రమలున్నా ఇక్కడి వారు ఉపాధి కోసం నిరుద్యోగ యువత అల్లాడుతున్నారని ఆయన అవేదన వ్యక్తం చేశారు. దీంతోపాటు కాలుష్యం కోరల్లో స్థానికులు చిక్కుకుని నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థలో మార్పులతోనే ఇటువంటి సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. 'నన్ను గెలిపిస్తే మీ తరపున నేను పోరాడుతా. ఉపాధి, కాలుష్యం, రైతు సమస్యలపై అలుపెరుగని పోరాటం జరుపుతా'నని హామీ ఇచ్చారు.
(And get your daily news straight to your inbox)
May 19 | పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు, తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ, మూడే ముళ్ళు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసీ నూరేళ్ళు అంటూ ఎవర్వైనా తమ పెళ్లి అనగానే ఆ రోజున ఎంతో ఆనందంగా ఉంటూ.. అహ్లాదకరంగా గడపుతారు.... Read more
May 19 | ప్రేమ అనేది రెండు అక్షరాలే అయినా ఎప్పుడు ఎవరి మీద ఎలా కలుగుతుందో చెప్పలేం. ఇక ప్రేమ కలిగిన తర్వాత అబ్బాయి, తన ప్రేమను అమ్మాయికి తెలుపడానికి నానా తిప్పలు పడుతుంటాడు. ఎలా తనలో... Read more
May 19 | పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు జైలు శిక్షను విధించింది. ఏడాది పాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. 1988లో రోడ్డుపై గొడవ పడిన... Read more
May 19 | మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలో హిందువులపై అదనపు పన్నులు వేసిన ఇబ్బందులకు గురిచేశాడన్న విషయం చరిత్ర పాఠ్యపుస్తాకాల్లో నిక్షిప్తమైవుంది. ఈ అంశమే ఇప్పుడు మహారాష్ట్రలో ప్రజల మధ్య శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తోంది. ఇటీవల... Read more
May 19 | ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లోని ఏఈసీ పాఠశాలలో ఉపాధ్యాయ ఆశావహులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని... Read more