no state in country exits with out bsp: Pawan kalyan మాయావతి ప్రధానైతేనే అట్టగుడువర్గాల అభివృద్ది: పవన్

No state in country exits with out bahujan saman party pawan kalyan

pawan kalyan, Mayawati, Bahujana JanaSena YuddhaBheri, Pawan Kalyan speech at YuddhaBheri, Mayawati speech at YuddhaBheri, Vijayawada YuddhaBheri, Nadendla Manohar, VV Laxminarayana, janasena, BSP, CPI, CPM, TDP, YSRCP, BJP, Congress, andhra pradesh, politics

Janasena party President Pawan Kalyan says no state in India is with out bahujan saman party and no village with its party activist. He acertains that BSP chief Mayawati becomes Prime Minister of India.

దేశంలో బీఎస్పీ లేని రాష్ట్రం లేదు: పవన్ కల్యాణ్

Posted: 04/03/2019 08:46 PM IST
No state in country exits with out bahujan saman party pawan kalyan

బీఎస్పీ అధినేత మాయావతి అందరికీ ఆదర్శమని, ఆరాచక శక్తులు మాటువేసిన ఉత్తర్ ప్రదేశ్ లో అన్నింటినీ ధైర్యంగా ఎదురొడ్డి పోరాడిన ధీరవనిత ఆమె అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కొనియాడారు. ఒక పోస్టల్ క్లర్ కూతురిగా వున్న అమె నాలుగు పర్యాయాలు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారంటే అమె భావజాలాన్ని అక్కడి ప్రజలు ఎంతగా అదరించారో అర్థం చేసుకోవచ్చని అన్నారు. దేశంలో ప్రస్తుతం బీఎస్పీ పార్టీ లేని రాష్ట్రం లేదని, ఇక ఆ పార్టీ కార్యకర్తలు లేని గ్రామం కూడా లేదని పవన్ పేర్కోన్నారు.

రాజకీయాల్లోకి తనలాంటి వాడు వస్తేనే ఇబ్బందులు తప్పడం లేదని, ఇక అలాంటి తరుణంలో అమె ఒంటి చేత్తే పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించారంటే అమెలో ఎంత పట్టుదల, అకుంఠిత దీక్ష వుందో అర్థమవుతుందని అన్నారు పవన్. ఈ సందర్భంగా అమెపై ప్రశంసలు కురిపిస్తూ.. మాయావతిని ఆకాశానికి ఎత్తేసారు. విజయవాడలోని ఎంబీపీ స్టేడియంలో జనసేన పార్టీ  నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఓ సామాన్య వ్యక్తి సీఎం కావడం చాలా కష్టంతో కూడుకున్న పని అని, అలాంటిది, మాయావతి ఇప్పటికే నాలుగుసార్లు సీఎం అయ్యారని కొనియాడారు. అంబేద్కర్, కాన్షీరామ్ లాంటి గొప్ప వ్యక్తులు సామాజిక వ్యవస్థలో మార్పులు తెచ్చారని అన్నారు. నాలుగు సార్లు సీఎం గా చేసిన వ్యక్తి మాయావతి తనకు స్ఫూర్తి అని, నరేంద్ర మోదీ కూడా మాయావతి నుంచి స్ఫూర్తి పొందిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశంలో బీఎస్పీ కార్యకర్తలు లేని గ్రామం లేదని అన్నారు. తమ ఎమ్మెల్యేలు తప్పు చేస్తే బేడీలు వేసి రోడ్డుపై నడిపించిన ఆదర్శ మహిళ మాయావతి అని కొనియాడారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  Mayawati  Bahujana JanaSena YuddhaBheri  Vijayawada  janasena  BSP  andhra pradesh  politics  

Other Articles