NBW issued against TDP MLA Vallabhaneni Vamsi క్లోజైన కేసులో వలభనేని వంశీకి నాన్ బెయిలెబుల్ వారెంట్లు

Non bailable warrant issued against tdp mla vallabhaneni vamsi

NBW to vallabhaneni vamsi, gannavaram MLA vallabhaneni vamsi, telangana government vendetta politics, kcr return gift politics, High court, non bailable warrant, chandrababu, TDP, YS Jagan, YSRCP, TRS, Andhra pradesh, politics

Gannavaram TDP candidate and sitting MLA Vallabhaneni Vamsi was issued a non-bailable warrant. The warrant issued by the Nampally court in Hyderabad has been executed by Telangana. The case was registered under the Arms Act of 2009 on Vamsi.

క్లోజైన కేసులో వలభనేని వంశీకి నాన్ బెయిలెబుల్ వారెంట్లు

Posted: 04/03/2019 09:31 PM IST
Non bailable warrant issued against tdp mla vallabhaneni vamsi

సరిగ్గా ఎన్నికల వేళ టీడీపీ అభ్యర్థులకు కష్టాలు వచ్చి పడుతున్నాయి. కడప జిల్లా మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ప్రచారం చేసుకుంటున్న క్రమంలో ఆయన ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారన్న వార్త వెలుగులోకి వచ్చింది. సరిగ్గా అదే సమయంలో కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ అభ్యర్థి.. సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.

గన్నవరంలో వల్లభనేని వంశీ మరోసారి తన అభ్యర్థిత్వాన్ని బలపర్చాలని ఎన్నికల బరిలో నిలిచి ప్రచారం చేసుకుంటున్న క్రమంలో ఆయనపై ముగిసిపోయిన  కేసులో మళ్లీ కొత్తగా నాన్ బెయిలెబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. 2009లో వంశీపై ఆయుధాల చట్టం కింద నమోదైన కేసుకు సంబంధించి హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో 2013లో విచారణ జరిగిన తరువాత ఆయనపై న్యాయస్థానం కేసును కొట్టివేసింది.

తనకు ప్రభుత్వ రక్షణ వద్దంటూ ప్రైవేట్ భద్రతను వంశీ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో వంశీ వద్ద అక్రమ ఆయుధాలు లభించాయని ఆయనపై అప్పట్లో కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు విచారణకు వంశీ నాంపల్లి కోర్టుకు హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ ను కోర్టు జారీ చేసింది. ఈ విషయమై వంశీ మాట్లాడుతూ, ఈ కేసును 2013లోనే హైకోర్టు కొట్టి వేసిందని, ఇప్పుడు తనను ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించి నాడు హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతిని నాంపల్లి కోర్టుకు నివేదిస్తానని ఆయన చెప్పారు. కాగా, తనను తెలంగాణ ప్రభుత్వం టీడీపీ నుంచి వైసీపీలోకి చేరాలని బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పూనుకుందని ఆయన వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vallabhaneni vamsi  gannavaram MLA  kcr  chandrababu  TDP  YS Jagan  YSRCP  TRS  Andhra pradesh  politics  

Other Articles