lokniti csds says-not-done-any-survey on AP Elections ఏపీలో ఎలాంటి సర్వేలు చేయలేదన్న సర్వే సంస్థ

Lokniti csds survey results show tdp will again come back to power in andhra pradesh

Lokniti-CSDS survey results, Lokniti-CSDS survey on AP assembly, Lokniti-CSDS survey in Andhra pradesh, Lokniti-CSDS condems survey news, Lokniti-CSDS, suvey results, Andhra Pradesh, Assembly survey results, no survey, AP Politics

Lokniti-CSDS has NOT done any survey in the State of Andhra Pradesh. What is being shared on social media is FAKE and complete rubbish condems survey

టీడీపీకే మళ్లీ పట్టం: 'లోక్ నీతి-సీఎస్డీఎస్' సర్వే

Posted: 04/01/2019 01:45 PM IST
Lokniti csds survey results show tdp will again come back to power in andhra pradesh

ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ ప్రజానాడి టీడీపీ పక్షానికే మద్దుతుగా వుందని, ఆ పార్టీ విజయదుందుభి మోగిస్తుందని ఓ సర్వేలో వెల్లడైంది. ఏబీపీ చానల్ కోసం 'లోక్ నీతి-సీఎస్డీఎస్' నిర్వహించిన ఈ సర్వేలో టీడీపీకి 126 నుంచి 135 అసెంబ్లీ సీట్లు లభిస్తాయని, 18 నుంచి 22 లోక్ సభ స్థానాలు దక్కుతాయని అంచనా వేశారు. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, వైసీపీ గత ఎన్నికల మాదిరే ఈసారి కూడా ద్వితీయస్థానానికే పరిమితం అవుతుందని, ఆ పార్టీకి 45 నుంచి 50 అసెంబ్లీ స్థానాలు, 3 నుంచి 5 లోక్ సభ స్థానాలు దక్కుతాయని సర్వే చెబుతోంది.

మొత్తంమ్మీద టీడీపీకి తిరుగులేని మెజారిటీ ఖాయమని 'లోక్ నీతి-సీఎస్డీఎస్' సర్వే పేర్కొంది. కాగా, ఓటింగ్ శాతంపైనా సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. టీడీపీకి 46.2 శాతం ఓట్లు, వైసీపీకి 37.2 ఓట్లు పోలవుతాయని సర్వే నివేదికలో తెలిపారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలోని జనసేన పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో 2 నుంచి 5 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందట. మార్చి 11 నుంచి 19వ తేదీ నడుమ అన్ని వయసుల ఓటర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ సర్వే చేపట్టారు.

ఆ ఫలితాలన్నీ ఉత్తవే.. సర్వే చేయనేలేదన్న సంస్థలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తిరిగి టీడీపీ అధికారంలోకి వస్తుందని లోక్‌నీతి-సీఎస్డీఎస్ సర్వేలో వెల్లడయినట్టు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ప్రచారంపై ఆ సంస్థ స్పందించింది. ఈ సర్వేతో తమకు ఎలాంటి సంబంధం లేదని, అసలు ఏపీలో ఎలాంటి సర్వే చేపట్టలేదని పేర్కొంది. ‘తాము ఏపీలో ఎలాంటి సర్వే చేపట్టలేదని, సోషల్ మీడియాలో వస్తున్న వారల్లో నిజం లేదని స్పష్టం చేసింది. తమ సర్వే పేరుతో ప్రచారమవుతన్నదంతా ఫేక్ అని, పూర్తిగా అసంబద్ధమైనదని’ అంటూ ఆ సంస్థ ట్వీట్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lokniti-CSDS  suvey results  Andhra Pradesh  Assembly survey results  no survey  AP Politics  

Other Articles