Anchor shyamala Joins YSRCP వైసీపీలో మళ్లీ చేరిన హీరో రాజశేఖర్, జీవిత..

Cine hero rajasekhar and jeevitha joins ysrcp

YSRCP president YS Jagan, YS Jagan Rajasekhar Jeevitha, YS Jagan jeevitha rajasekhar, YS Jagan anchor shyamala, YS Jagan Bigboss contestanat shyamala, YS Jagan, YSRCP, Hero Rajasekhar, Jeevitha, Anchor Shyamala, andhra pradesh, politics

Tollywood actors Rajasekhar and Jeevitha have been trying hard to prove their mettle in Telugu politics. They joined several political parties but could not fit in themselves and walked out. Now After a while, They joined YSRCP in the presence of YS Jagan.

వైసీపీలో మళ్లీ చేరిన హీరో రాజశేఖర్, జీవిత.. యాంకర్ శ్యామల కూడా

Posted: 04/01/2019 02:49 PM IST
Cine hero rajasekhar and jeevitha joins ysrcp

పలువురు ప్రముఖ సినీ, బుల్లితెర నటులు ఇవాళ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ ఉదయం లోటస్ పాండ్ కు చేరుకున్న సినీనటుటు జీవిత, రాజశేఖర్ లు జగన్ ను కలసి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికలకు ముందే తనకు గతంలో జగన్ తో ఏర్పడిన అభిప్రాయబేధాలను తొలగించు కోవాలని భావించి, ఓ మారు కలుద్దామని వచ్చామని, జగన్ ఎంతో మారిపోయారని, ఒకప్పుడు తాను చూసిన జగన్ వేరు, ఇప్పుడు చూసిన జగన్ వేరని హీరో రాజశేఖర్ వ్యాఖ్యానించారు.

ఈ ఉదయం తన భార్య జీవితతో కలిసి లోటస్ పాండ్ కు వచ్చి, జగన్ తో చర్చించి, వైసీపీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సూపర్ సీఎం అనుకుంటే, ఆయన్ను దించేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి సూపర్, డూపర్ సీఎం అనిపించుకున్నారని, అంతకుమించి జగన్ చేయగలడన్న నమ్మకం తనకుందని అన్నారు. ఆరోగ్య శ్రీ పథకంతో పాటు రైతులకు వైఎస్ ఎంతో మేలు చేశారని, ప్రజల మనసుల్లో ఉండిపోయారని వ్యాఖ్యానించారు. జగన్ మామూలు బిడ్డ కాదని, పులిబిడ్డని చెప్పారు. జగన్ తమపై ఎంతో ప్రేమ, ఆప్యాయతలను చూపించారని పొగడ్తలు కురిపించారు.

ఆ తరువా టీవీ యాంకర్, బిగ్ బాస్ 2 కంటెస్టంట్ శ్యామల తన భర్త నర్సింహారెడ్డితో కలసి వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ, వైసీపీ కుటుంబంలో కలిసినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. జగన్ అన్నను చాలా కాలంగా పరిశీలిస్తున్నానని.. ఆయన విధివిధానాలు, ఆయన చేస్తున్న మంచి పనులు తనకు ఎంతో నచ్చాయని తెలిపారు. అన్న చేస్తున్న మంచి పనుల్లో స్వయంగా పాలుపంచుకోవాలనే ఈరోజు వైసీపీలో చేరామని చెప్పారు.

జగన్ అన్న చెబుతున్న నవరత్నాలు, ఫీజు రీయింబర్స్ మెంట్, మద్యపాన నిషేధం, ఆరోగ్యశ్రీ పథకాలు తమకు ఎంతో నచ్చాయని చెప్పారు. తనకు సపోర్ట్ గా తన భర్త కూడా వచ్చారని తెలిపారు. తాము కూడా వైసీపీ ప్రచారంలో పాలుపంచుకోబోతున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరు వైసీపీకి ఓటు వేసి ఘన విజయాన్ని అందించాలని కోరారు. ఆ తరువాత అమె భర్త నర్సింహారెడ్డి మాట్లాడుతూ, ఏపీ ప్రజలందరితో పాటు తాము కూడా జగన్ అన్న కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. జగన్ అన్నతో కలసి నడవాలనుకుంటున్నామని చెప్పారు.

అనంతరం మరో సినీనటి మరో సినీ నటి హేమ వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా హేమను జగన్ ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలను అడిగి తెలుకున్నారు. గత ఎన్నికల్లో ఆమె మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమర్ రెడ్డి స్థాపించిన సమైఖ్యాంధ్ర పార్టీ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. మరోవైపు ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి... ఉపాధ్యక్షురాలిగా గెలుపొంది, సత్తా చాటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  YSRCP  Hero Rajasekhar  Jeevitha  Anchor Shyamala  andhra pradesh  politics  

Other Articles