Tejasvi Surya accused of assault, abuse of women బీజేపి అభ్యర్థి తేజస్వి సూర్యపై లైంగిక అరోపణలు..

Bjp s candidate from bangalore south tejasvi surya accused of abuse post allegations

Tejasvi Surya, BJP, Bangalore South, Lok Sabha polls, Lok Sabha seat, Dr Som Dutta, Shefali Vaidya, Congress, Karnataka, politics

BJP's candidate from Bangalore South, Tejasvi Surya, has found himself in even deeper hot water. Dr Som Dutta, an accomplished entrepreneur, called out Shefali Vaidya for praising Surya, a man she dubbed "womaniser, abuser and woman beater".

బీజేపి అభ్యర్థి తేజస్వి సూర్యపై లైంగిక అరోపణలు..

Posted: 03/28/2019 06:59 PM IST
Bjp s candidate from bangalore south tejasvi surya accused of abuse post allegations

ఎన్నికల వేళ అభ్యర్థులపై అరోపణలు రావడం పరిపాటే. కానీ ఈ అభ్యర్థిపై ఏకంగా లైంగిక అరోపణలు రావడం. హిందువుగా పుట్టినంత మాత్రాన ప్రతీ ఒక్కరు ధార్మికుడు కాలేరని, గొప్ప ప్రసంగాలు చేసేవారందరూ గొప్ప వ్యక్తులు కాలేరని కర్ణాటకలోని ఓ అభ్యర్థిని ఉద్దేశిస్తూ సామాజిక మాద్యమాల్లో ఓ మహిళ చేసిన అరోపణలు ఇప్పుడు ఆ యువ అభ్యర్థికి శాపంలా పరిణమించాయి. వాటిని ఆయన ధీటుగానే ఎదుర్కొంటూ ఖండిస్తున్నా.. అయపై వచ్చిన అరోపణల్లో ఎంతో కొంత మాత్రం నిజముంటుందన్న భావన ఇక్కడి ఓటర్లలో ఉత్పన్నమవుతోంది.

బెంగళూరు సౌత్ నుంచి 28 ఏళ్ల యువ న్యాయవాదిని బీజేపీ తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది ఆయన పేరే తేజస్వి సూర్య. కాగా ఆయన మంగళవారం నామినేషన్ ధాఖలు చేయగానే ఆయనపై లైంగిక ఆరోపణలు రావడం ఇప్పుడు బీజేపీకి తలనొప్పిగా మారాయి. మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించినట్టు తేజస్విపై ఆరోపణలు ఉన్నాయంటూ కాంగ్రెస్ ట్వీట్ చేసి కలకలం రేపింది. అయితే కాంగ్రెస్ పార్టీ పనిగట్టుకుని ఈ అభ్యర్థిపై ఆ అరోపణలు చేయలేదు.

తేజస్వీ సూర్యపై ఈ మేరకు ఓ మహిళా బాధితురాలుగా పేర్కోంటూ షఫాలీ వైద్య తన ట్విట్టర్ అకౌంట్ లో చేసిన ట్వీట్‌ స్ర్కీన్ షాట్లను జతచేస్తూ.. కాంగ్రెస్ బీజేపి అభ్యర్థిపై ఆరోపణలు గుప్పించింది. అంతటితో అగకుండా అందిన అవకాశాన్ని పూర్తిగా.. అందులోనూ సరిగ్గా ఎన్నికల సమయంలో చేతికి అందిన అస్త్రాన్ని వినియోగించుకుంటుంది. ‘తేజస్వి సూర్యను మరో ఎంజే అక్బర్ లా తయారు చేస్తున్నారా?’ అంటూ కాంగ్రెస్ బీజేపిని ప్రశ్నించింది. బీజేపీకి ఇటువంటి వాళ్లే కావాల్సి వస్తున్నారని ఆరోపిస్తూ ట్వీట్ చేసింది. కాంగ్రెస్ ట్వీట్‌పై అటు బీజేపీ కానీ, ఇటు తేజస్వి కానీ ఇప్పటి వరకు స్పందించలేదు.

జర్నలిస్టుపై లైంగిక ఆరోపణల కారణంగా మంత్రి ఎంజే అక్బర్ గతేడాది తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడా విషయాన్ని గుర్తుచేస్తూ తేజస్వి మరో ఎంజే అక్బర్ కాబోతున్నాడంటూ కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. నిజానికి బెంగళూరు సౌత్ నుంచి ఇటీవల మృతి చెందిన కేంద్రమంత్రి అనంత్‌కుమార్ భార్య బరిలోకి దిగుతారని అందరూ భావించారు. అయితే, బీజేపీ అనూహ్యంగా బీజేపీ యూత్ వింగ్ లీడర్ తేజస్వి సూర్యను బరిలోకి దింపి అందరినీ ఆశ్చర్యపరిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tejasvi Surya  BJP  Dr Som Dutta  Shefali Vaidya  Congress  Karnataka  politics  

Other Articles