YSRCP Sensational allegations on AP DGP డీజీపీ ఆర్పీ ఠాకూర్ పై సంచలన అరోపణ

Ysrcp sensational allegations on ap dgp rp thakur

DGP RP Thakur, vijay sai reddy, YS Jagan, police vehicles, telephone tapping, Chandrababu, Election Commission of India, YSRCP, TDP, Nara Lokesh, Uma reddy venkateshwarlu, Andhra Pradesh, Politics

Welcoming the decision of the EC to remove intelligence chief from poll duties, the YSRCP demanded that action be taken against DGP RP Thakur for working at the behest of the State government.

డీజీపీ ఆర్పీ ఠాకూర్ పై వైసీపీ సంచలన అరోపణ

Posted: 03/28/2019 05:58 PM IST
Ysrcp sensational allegations on ap dgp rp thakur

ఎన్నికల వేళ అధికారులపై విమర్శలు అరోపణలు రావడం సహజమే. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఈ ఆరోపణలు తీవ్రస్థాయికి చేరకున్నాయి. ప్రభుత్వాధికారులు అధికారిక ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఇప్పటికే వినిస్తున్న తరుణంలో రాష్ట్రంలోని అత్యున్నత స్థాయి అధికారిపై ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలు అరోపణలు గుప్పించడం.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీమాంశంగా మారింది. రాష్ట్రానికి పోలీస్ బాస్ గా వున్న వ్యక్తే అధికార పార్టీ ఏజెంటుగా మారారని వైసీపీ నేతలు అరోపిస్తున్నారు.

ఈ మేరకు వారు కేంద్ర ఎన్నికల కమీషనర్ ను కలిశారు. ఏపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని సీఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల అధికారులకు పిర్యాదు చేసినా తమకు న్యాయం జరగలేదని వారు గోడ వెల్లబోసుకున్నారు. రాష్ట్ర డీజీపీ అర్పీ ఠాకూర్ ను ఎన్నికల విధుల నుంచి తప్పించడమో లేక బదిలీ చేయడమో చేస్తే కానీ తమకు న్యాయం జరగదని వారు కోరుతున్నారు. డీజీపీ టీడీపీకి లబ్ది కలిగేలా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు.

ఈ మేరకు ఢిల్లీ వెళ్లి సీఈసీని కలిసిన వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, సుబ్బారెడ్డీలు మీడియాతో మాట్లాడుతూ డీజీపీని వెంటనే తొలగించేలా చర్యలు చేపట్టాలని సీఈసీని డిమాండ్ చేశారు. ఇక రాష్ట్రంలోని ముగ్గురు ఐపీఎస్ లను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఈసీ జారీ చేసిన ఆదేశాలను కూడా సీఎం చంద్రబాబు బేఖాతరు చేస్తున్నారని ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఇక డీజీపీగా ఠాకూర్ కొనసాగితే.. పోలీసు వాహనాల్లోనే డబ్బుని నియోజకవర్గాలకు చేరవేస్తారని అరోపించిన ఆయన.. డీజీపీ ఠాకూర్ తన వాహనంలో రూ.35 కోట్లు తరలించారని ఫిర్యాదు చేయడం కొసమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles