pawan kalyan to contest from two constituencies.? రెండు స్థానాల నుంచి బరిలో పవన్ కల్యాణ్..?

Pawan kalyan to contest from two constituencies

pawan kalyan, janasena, Pawan Kalyan general body meeting, pawan kalyan tirupathi, pawan kalyan gajuwaka, pawan kalyan two constituencies, andhra pradesh, politics

Janasena chief Pawan Kalyan had decided to contest assembly elections from two constituencies, he himself said that general body is in final discussion about the constituencies from where he will fight elections.

రెండు స్థానాల నుంచి బరిలోకి జనసేనాని..? అన్న బాటలోనే తమ్ముడు..

Posted: 03/19/2019 11:09 AM IST
Pawan kalyan to contest from two constituencies

ఎన్నికల రణతంత్రంలో తనదైన బాటలో దూసుకుపోతున్న జనసేన అధినేత పవర్ స్టార్ ఫవన్ కల్యాణ్.. ఒక్క విషయంలో మాత్రం తన సోదరుడు, మోగాస్టార్ చిరంజీవిని ఫాలో అవుతున్నారు. ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసిన సందర్భంగా వచ్చిన ఎన్నికలలో చిరంజీవి తిరుపతి నియోజకవర్గంతో పాటు తన సొంతూరు నుంచి (పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు) కూడా ఎన్నికల బరిలో దిగారు. అయితే ప్రజారాజ్యం పార్టీకి.. జనసేన పార్టీ మధ్య అనేక తేడాలు వున్నా.. ఈ ఒక్క విషయంలో మాత్రం అన్నబాటలోనే తమ్ముడు పవన్ కల్యాణ్ కూడా నడవాలని యోచిస్తున్నారని సమాచారం.

రాబోయే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కూడా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు. అయితే ఆ రెండు నియోజకవర్గాలు ఏంటన్నది మరో గంటలో వెల్లడిస్తామని ఇవాళ పది గంటల సమయంలో ట్వీట్ చేశారు. ప్రస్తుతం దానిపై జనరల్ బాడీ చర్చలు జరుపుతోందని తెలిపారు. పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ వస్తే జనసేన ప్రచారానికి మరింత ఊపు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇంతకుముందు వినిపించిన ఊహాగానాల ప్రకారం పవన్ కల్యాణ్ గాజువాక, పిఠాపురం నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గాజువాకలో తన పార్టీకి లక్షకు పైగా జనసేన సభ్యత్వాలు వుండటం కారణం కాగా, ఇక ఫిఠాపురం నియోజకవర్గాలో కాపు ఓటు బ్యాంకు పెద్ద సంఖ్యలో ఉండటం తనకు కలిసొచ్చే అంశంగా జనసేనాని భావిస్తున్నారు.గాజువాక పారిశ్రామిక ప్రాంతం కావడంతో.. వామపక్షాల పొత్తు కార్మిక వర్గ ఓటు బ్యాంకును సొంతం చేసుకోవచ్చని భావిస్తున్నారు. మొత్తం మీద పవన్ పోటీకి సంబంధించి ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చోపచర్చలకు మరో గంటలో ఫుల్ స్టాప్ పడనుంది. కాగా, పోటీ విషయంలో పవన్ కల్యాణ్ అన్న చిరంజీవినే అనుసరిస్తుండటం గమనార్హం.

2009 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి ఓటమిని చవిచూసిన చిరంజీవి, తిరుపతి నుంచి మాత్రం గెలుపోందారు. ఇదిలా ఉంటే, తాజా ఎన్నికల్లో బీఎస్పీ, వామపక్షాల పొత్తుతో జనసేన బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా బీఎస్పీకి 21 శాసనసభ, 3 లోక్‌సభ స్థానాలు కేటాయించారు. సీపీఐ, సీపీఎంలకు ఏడేసి చొప్పున అసెంబ్లీ, రెండేసి లోక్‌సభ స్థానాలు కేటాయించారు. మిగిలిన స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేయబోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  tirupathi  gajuwaka  general body  andhra pradesh  politics  

Other Articles