Gangireddy, Parameshwar Reddy in SIT custody వివేక హత్యో కేసు: సిట్ కస్టడీలో గంగిరెడ్డీ, పరమేశ్వరరెడ్డీ

Ys viveka murder case gangireddy parameshwar reddy in sit custody

The SIT team has fastened its investigation in the sensational murder case of former minister YS Vivekananda Reddy. In the case, the SIT officers have focused on the YS Viveka's associates. Now the case is revolving around Gangireddy, and Parameshwar Reddy. komma parameshwara reddy and gangireddy beyond ys vivekananda reddy murder, komma parameshwara reddy missing, komma parameshwara reddy absconding, komma parameshwara reddy, GangiReddy, YS vivekananda reddy, viveka murder case, viveka mysterious murder, viveka brutal murder, simhadripuram, suhasini, crime

The SIT team has fastened its investigation in the sensational murder case of former minister YS Vivekananda Reddy. In the case, the SIT officers have focused on the YS Viveka's associates. Now the case is revolving around Gangireddy, and Parameshwar Reddy.

సిట్ కస్టడీలో గంగిరెడ్డీ, పరమేశ్వరరెడ్డీ.. వీళ్ల పనేనా.?

Posted: 03/19/2019 12:02 PM IST
Ys viveka murder case gangireddy parameshwar reddy in sit custody

తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో అనుమానితులుగా భావిస్తున్న 126మందిని ఇప్పటికే విచారించిన అధికారులు.. వారి నుంచి కూడా ఈ హత్యకేసుకు సంబంధించిన కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది. కాగా, వివేకా ప్రధాన అనుచరులు గంగిరెడ్డి, పరమేశ్వర రెడ్డిల పైనే ఎక్కువ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వీరిద్దరనీ కూడా అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు వారిని విచారిస్తున్నారు.

వీరి నుంచి వీవేకనందరెడ్డి సంబంధించిన పూర్తి సమాచారం రాబట్టేందుకు సిట్ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరిని వేర్వేరు ప్రాంతాల్లో విచారిస్తున్నారు. కాగా, వివేకా హత్యకు 15రోజుల ముందే రెక్కీ జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు వారం రోజుల ముందు వివేకా ఫోన్ కు 'బీ కేర్‌ఫుల్' అని ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చినట్టు గుర్తించారు. హత్య జరగడానికి 10 రోజుల ముందు ఆయన ఇంట్లో పెంపుడు కుక్క అనుమానాస్పదంగా మృతి చెందడం కూడా అనుమానాలకు తావిస్తోంది. దీంతో ఇంట్లోని వ్యక్తులు కూడా వివేకా హత్యలో భాగం వుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

వైఎస్ వివేకానందరెడ్డికి, గంగిరెడ్డికి మధ్య ఓ భూ వివాదానికి సంబంధించిన వివాదం నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వివాదమే హత్యకు దారి తీసి ఉంటుందా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. రూ.125కోట్ల సెటిల్‌మెంట్‌తో ముడిపడి ఉన్న ఈ భూమిలో కొంత భూమిని వివేకాకు తెలియకుండా గంగిరెడ్డి అమ్మి సొమ్ము చేసుకున్నట్టు తెలుస్తోంది. విషయం వివేకాకు తెలియడంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైనట్టు అనుమానిస్తున్నారు.

గంగిరెడ్డి, పరమేశ్వర రెడ్డి చేతులు కలిపి ఈ హత్యకు పాల్పడి ఉంటారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పులివెందులలో తాను సంచలనం సృష్టించబోతున్నానంటూ పరమేశ్వర రెడ్డి గత కొంతకాలంగా ప్రత్యర్థులతో చెబుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇటీవల అతను టీడీపీలో చేరేందుకు కూడా ప్రయత్నించాడని.. వారితో టచ్‌లోనే ఉన్నాడని గుర్తించినట్టు సమాచారం. హత్యకు ముందురోజు పరమేశ్వర రెడ్డి వివేకాతోనూ, టీడీపీ నేతలతోనూ మాట్లాడినట్టు ఫోన్ కాల్ డేటాలో పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. మరో రెండు, మూడు రోజుల్లో సిట్ అధికారులు ఈ కేసు మిస్టరీని చేధించే అవకాశం కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : parameshwara reddy  GangiReddy  YS vivekananda reddy  simhadripuram  suhasini  kadapa  Andhra pradesh  crime  

Other Articles