India will fight, live, work and win as one: PM Modi ఆర్మికి అండగా యావత్ దేశం.. ఐక్యతలో లేదు భేదం: ప్రధాని

India will fight live work and win as one pm narendra modi

pm modi campaign, pm modi campaign today, pm modi campaign live, pm modi on soldiers, pm modi on 2019 elections, pm modi booth campaign, pm modi speech today, pm modi news pm modi news today, pm modi, pm modi india, pm narendra modi, pm narendra modi campaign, pm narendra modi booth campaign, pm narendra modi speech today

PM Narendra Modi said India “will fight, live, work and win” as one and nobody can create hurdles in its march towards development. “It is necessary to ensure that nothing is done to dent the morale of the security forces,” the Prime Minister said.

ఆర్మికి అండగా యావత్ దేశం.. ఐక్యతలో లేదు భేదం: ప్రధాని

Posted: 02/28/2019 03:00 PM IST
India will fight live work and win as one pm narendra modi

దేశం విషయానికి ఎవరు వచ్చినా యావత్ భారతం ఐక్యంగా ఎదుర్కోంటుందని అంతా ముక్తకంఠంతో ఒక్కటిగా జీవిస్తాం.. ఒక్కటిగా పోరాడుతాం.. ఒక్కటిగా గెలుస్తామని నినదిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని స్పష్టం చేశారు. సరిహద్దులో పాకిస్థాన్ చర్యల వల్ల అటు సైనికులకు గానీ, ఇటు దేశ ప్రజలకు గానీ ఆత్మస్థైర్యం ఏమాత్రం దెబ్బతినలేదన్నారు. ఇవాళ ఆయన ‘మేరా బూత్ సబ్‌సే మజ్‌బూత్’ అనే పార్టీ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలతో మాట్లాడారు.

భారత గగనతలంలోకి పాక్ యుద్ధ విమానాలతో తెగబడటం, పాకిస్థాన్ తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మోదీ ప్రసంగం ప్రాధాన్యం సంతరించుకుంది. నమో యాప్ ద్వారా 15,000 ప్రాంతాల నుంచి కోటి మందికి పైగా కార్యకర్తలతో మోదీ ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా మోదీ భావోద్వేగంగా మాట్లాడారు. ఉగ్రదాడుల ద్వారా భారత్ ను విడగొట్టడానికి పాక్ ప్రయత్నిస్తోందని మోదీ మండిపడ్డారు. ఇప్పుడు దేశ పౌరులందరూ సైనికుల్లా అలర్ట్ గా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో దేశానికి సంబంధించిన ఎలాంటి పేక్ వార్తలు ప్రచారంలోకి వచ్చినా వాటిని నమ్మకూడదని ఆయన పిలుపునిచ్చారు.

దాయాధి పాకిస్థాన్ భారత్ ను ధైర్యంగా ఎదుర్కోనలేక.. భారతీయులను విడదీసేందుకు.. అస్థిర పరచడానికి ప్రయత్నాలు చేస్తుందని వాటిని తిప్పికోట్టాలని అన్నారు. మన అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ, దేశమంతా ఇప్పుడు ఒక్కతాటిపైకి వచ్చి పాక్ దుష్ట ఆలోచనలను తిప్పి కొడుతోంది. ఇలాంటి సమయంలో భద్రతా బలగాల నైతిక స్థెర్యాన్ని దెబ్బ తీసేలా ఎవరూ వ్యవహరించకూడదు’ అని మోదీ అన్నారు. వారికి దేశప్రజలందరూ తమ అండదండలను అందించాలని కోరారు.

2014 ఎన్నికల సమయంలో ప్రజల కనీస అవసరాలు తీర్చడం ఎజెండాగా ఉండేదని.. ప్రస్తుతం దేశవాసుల కలలను సాకారం చేయడం ఎజెండాగా మారిందని నరేంద్ర మోదీ చెప్పారు. అభివృద్ధిలో భారత్ మరో స్థాయికి చేరుకుందని ఆయన తెలిపారు. స్థిరమైన ప్రభుత్వం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించి చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అయితే పార్టీ కార్యకర్తల సమావేశంలో కూడా అమరుల అంశం, పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ చేసిన అంశాలను వాడుకోవటంపై విపక్షాలు ఖండిస్తున్నాయి. దేశానికి సంబంధించిన అంశాన్ని కూడా రాజకీయం చేస్తారా.? అంటూ ప్రశ్నిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pm modi  Mera Booth Sabse Mazboot  BJP  NaMo app  India  Pakistan  

Other Articles