Pawan Kalyan demands immidiate release of Indian Pilot భారత పైలట్ వెంటనే విడుదల చేయాలి: పవన్ డిమాండ్

Jana sena demands pakistan for immidiate release of vikram abhinandan

Pawan kalyan, janasena, vikram abhinandan, Pakistan, india, mig 21, save abhinandan, PM Narendra Modi, Indian Air Force, Pakistan Air Force, politics

Actor turned Politician JanaSena chief Pawan Kalyan demands pakistan to release Indian Pilot Vikram Abhinandan, who was caught by pakistan army after mig 21 crashed chasing PAF F-16 yesterday.

భారత పైలట్ వెంటనే విడుదల చేయాలి: పవన్ డిమాండ్

Posted: 02/28/2019 03:49 PM IST
Jana sena demands pakistan for immidiate release of vikram abhinandan

పాకిస్తాన్ ఆర్మీ చేతిలో బంధీగా ఉన్న భారత వాయుసేన వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ క్షేమంగా తిరిగి రావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఆయనను పాకిస్థాన్ ప్రభుత్వం తక్షణం విడుదల చేసిన పంపాలని ఆయన డిమాండ్ చేశారు. యుద్ధ ఖైదీలను హింసించరాదని, బందీగా చిక్కిన సైనికులను సురక్షితంగా వారి దేశాలకు అప్పగించాలని జెనీవా ఒప్పందం చెబుతోందని పవన్ గుర్తు చేశారు. పాకిస్తాన్.. జెనీవా ఒప్పందాన్ని గౌరవించాలని, అభినందన్‌ను భారత్‌కు అప్పగించాలని పవన్ డిమాండ్ చేశారు.

ప్రస్తుతం దేశంలో యుద్ధ వాతావరణం నెలకొందని పవన్ అన్నారు. యుద్ధం జరిగితే ఇరువైపులా నష్టం వాటిల్లుతుందన్నారు. యుద్ధం ఎవరూ కోరుకోరని చెప్పారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో వింగ్ కమాండర్ అభినందన్ పాక్ చెరలో  బందీగా ఉండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. అభినందన్ క్షేమంగా తిరిగిరావాలని జనసేన మనస్ఫూర్తిగా కోరుకుంటోందని పవన్ చెప్పారు. . యుద్ధం అంటూ జరిగితే.. భారత ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్పారు.

ఫిబ్రవరి 27వ తేదీ బుధవారం ఉదయం పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత భూభాగంలోకి చొరబడి దాడికి యత్నించాయి. వెంటనే అప్రమత్తమైన భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు పాక్ విమానాలను తరిమికొట్టాయి. పాకిస్తాన్‌కు చెందిన ఓ విమానాన్ని కూల్చేశాయి. పాక్ విమానాలను తరిమికొట్టే క్రమంలో భారత్‌కు చెందిన మిగ్ 21 బైసన్ జెట్ పాకిస్తాన్ భూభాగంలో కుప్పకూలింది. అందులో ఉన్న వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ ప్యారాచూట్ ద్వారా పాకిస్తాన్ భూభాగంలో ల్యాండ్ అయ్యారు. పాకిస్తాన్ ఆర్మీ వెంటనే అభినందన్‌ను చుట్టుముట్టి అదుపులోకి తీసుకుంది. ఆయనపై అక్కడ దాడి జరిగింది. అభినందన్‌ను తీవ్రంగా కొట్టి హింసించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  janasena  vikram abhinandan  Pakistan  Imram Khan  save abhinandan  politics  

Other Articles