Lover Srinu admits killing Jyothy పెళ్లి చేసుకోమ్మని ఒత్తిడి చేస్తోందని.. ప్రియుడే..

Angadi jyothi s murder case lover srinu the main accused

chenchu srinivas, angadi jyothi, guntur police, srinivas friends, mahanadu, amaravathi stadium, Fields, sexual assault, gang rape, iron rods, sticks, Thadepally, Andhra Pradesh, Guntur, Angadi Jyothis murder case, Mangalagiri, crime

The Guntur Urban Police achieved a breakthrough in the sensational murder of Angadi Jyothi, which occurred near the Amaravati Township in Mangalagiri last week. Police officials are reportedly going to name Chunchu Srinivasa Rao, as the main accused.

పెళ్లి చేసుకోమ్మని ఒత్తిడి చేస్తోందని.. ప్రియుడే..

Posted: 02/18/2019 03:04 PM IST
Angadi jyothi s murder case lover srinu the main accused

ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన అంగడి జ్యోతి హత్యకేసులో అది నుంచి ప్రియుడిపైనే అనుమానం వ్యక్తం చేసిన జ్యోతి సోదరుడి అరోపణలే నిజమయ్యాయి. ఈ హత్యకేసులో జ్యోతి ప్రియుడు చెంచు శ్రీనివాస్ పథకం ప్రకారమే తన సోదరిని హత్య చేశాడని, తనను పెళ్లి చేసుకోమ్మని జ్యోతి శ్రీనివాస్ ను నిలదీయడం, పదే పదే అడగంతోనే అమెను పథకం ప్రకారం హతమార్చాడని జ్యోతి సోదరుడు హత్య జరిగిన నాటి నుంచి అరోపిస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఆయన అరోపణలు పెడచెవిన పెట్టిన పోలీసులు.. వారి అరోపణలకు ఎలాంటి బలం లేదని ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేసిన ఉన్నతాధికారులు.. మంగళగిరి రూరల్ ఎస్ఐ బాబురావుపై బదిలీ వేటు వేశారు. సిఐ బాలాజీ ఉన్నతాధికారులకు పంపిన నివేదిక ఆధారంగా పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. కాగా, బంధువుల డిమాండ్ మేరకు జ్యోతి మృతదేహానికి రీ పోస్టుమార్టం కూడా నిర్వహించారు వైద్యులు.

బంధువులు అరోపణలు అక్షరాల నిజమయ్యాయని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో చిక్కుముడులను పోలీసులు విప్పుతున్నారు. జ్యోతిని ఓ పథకం ప్రకారం శ్రీనివాసే హత్య చేయించాడని నిర్ధారణకు వచ్చిన పోలీసులు, అతనికి సహకరించారని భావిస్తున్న శశి, పవన్ అనే యువకులను అరెస్ట్ చేశారు. వీరిద్దరూ హత్యకు వారం క్రితమే రెక్కీ నిర్వహించారని, స్టేడియం వెనుకవైపు జనసంచారం తక్కువగా ఉంటుందని, అక్కడికి జ్యోతిని తీసుకురావాలని శ్రీనివాస్ కు వీరే చెప్పారని పోలీసులు భావిస్తున్నారు.

తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేస్తుండటంతోనే జ్యోతిని వదిలించుకోవాలని శ్రీనివాస్ నిర్ణయానికి వచ్చాడని, జ్యోతిని కలిసే ముందు శ్రీనివాస్ సెల్ ఫోన్ నుంచి వీరిద్దరికీ కాల్స్ వెళ్లాయని స్పష్టమైనట్టు చెబుతున్నారు. నేడు శ్రీనివాస్ ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయని, ఆ వెంటనే అదుపులోకి తీసుకుని, గంటల వ్యవధిలోనే కేసు గురించిన పూర్తి వాస్తవాలను వెలుగులోకి తెస్తామని పోలీసు అధికారులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chenchu srinivas  angadi jyothi  guntur police  C.I. Balaji  Andhra Pradesh  Crime  

Other Articles